Raviteja's Mass Jathara Censor Review : మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహించగా... రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ధమాకా' తర్వాత హిట్ కాంబో రిపీట్ కానుండడంతో 'మాస్ జాతర'పై మాస్ ఆడియన్స్‌తో పాటు రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.
సెన్సార్ రివ్యూ ఎలా ఉందంటే?
ఈ మూవీకి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. 'మాస్, ఫన్ అండ్ యాక్షన్... అన్నీ ఒకదానిలోనే! థియేటర్స్‌లో ఎంటర్టైన్మెంట్ మాస్ వేవ్స్ ఆస్వాదించండి.' అంటూ రాసుకొచ్చింది. రవితేజ, శ్రీలీల కాంబో, మాస్ యాక్షన్ సీన్స్, డ్యాన్స్ వేరే లెవల్ అన్నట్లు తెలుస్తోంది.
RPF ఆఫీసర్‌గా రవితేజ కనిపించనుండగా... సైన్స్ టీచర్‌గా శ్రీలీల నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ వేరే లెవల్‌లో ఉండగా ఆడియన్స్‌కు పవర్ ఫుల్ మాస్ ట్రీట్ అందనున్నట్లు తెలుస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చని మూవీ టీం తెలిపింది.
రన్ టైం ఎంతంటే?
'మాస్ జాతర' రన్ టైం 2 గంటల 40 నిమిషాలుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ను ఈ నెల 27 రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు చేశారు. రవితేజతో పాటు శ్రీలీల, డైరెక్టర్ భాను భోగవరపు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. మరోవైపు, ప్రీమియర్స్ వేసేందుకు కూడా మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వాల పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ప్రీమియర్లపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గత కొంతకాలంగా రవితేజ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఈ మూవీతో ఆయన కమ్ బ్యాక్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: 'ఎల్లమ్మ' కోసం దేవిశ్రీ డ్యూయెల్ రోల్! - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్
రవితేజ కెరీర్‌లో ఇది 75వ సినిమా. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్ ట్రెండ్ సృష్టించాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య మూవీని నిర్మించారు. ఈ నెల 31 థియేటర్లలో 'మాస్ జాతర'ను చూసెయ్యండి.