ఈమధ్యకాలంలో సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం, దాన్ని అడ్డం పెట్టుకొని వైరల్ అయిపోవడం కామన్ అయిపోయింది. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడగడం కోసం, సమాచారం పంచుకోవడం కోసం ఈవెంట్స్‌ను ఏర్పాటు చేస్తే.. అది కాస్త పర్సనల్ ఇంటర్వ్యూలాగా మారిపోతుంది. ముఖ్యంగా ఓ సినీ జర్నలిస్ట్ ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు అడగడంలో ఆరితేరిపోయిన విషయం చాలామందికి తెలిసిందే. తాజాగా ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు మూవీ ఈవెంట్‌కు హాజరయ్యింది యాంకర్ రష్మీ. అక్కడ రష్మీని పలు ఇబ్బందికర ప్రశ్నలు అడిగినప్పటికీ తను మాత్రం తెలివిగా సమాధానం చెప్పింది.


యాంకర్ నుంచి హీరోయిన్ వరకు..
సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశం దొరక్క, దొరికిన ప్రొఫెషన్‌లో సెటిల్ అయిపోతున్న వారు ఉన్నారు. అలా అనుకున్న ప్రొఫెషన్‌లో కాకపోయినా.. దొరికిన ప్రొఫెషన్‌లో ఫేమ్ సాధించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రష్మీ ఒకరు. రష్మీ సినిమాల్లోకి వచ్చి, తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. అయినా కూడా తను కోరుకున్న గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరపై యాంకర్‌గా వచ్చిన అవకాశాన్ని అందుకున్న రష్మీ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యాంకర్‌గా ఎంటర్ అయిన తర్వాత రష్మీకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా కూడా వచ్చాయి. కానీ అవేవి పెద్దగా కమర్షియల్‌గా తగినంత హిట్ అవ్వలేదు. అందుకే ఎక్కువశాతం గెస్ట్ రోల్స్‌కే పరిమితం అయ్యింది.


ముద్దు ఎవరికి పెట్టారు..
తాజాగా ‘బాయ్స్ హాస్టల్’ సినిమాలో గెస్ట్ రోల్ చేసినందుకు రష్మీ.. ఈ మూవీ ఈవెంట్‌కు హాజరయ్యింది. అప్పుడే ‘బాయ్స్ హాస్టల్‌లో ఉండే బాయ్‌ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా’ అని జర్నలిస్ట్.. రష్మీని ప్రశ్నించారు. ‘‘అలాంటి వారికి, నాకు చాలా ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది’’ అని ఫ్రాంక్‌గా చెప్పేసింది రష్మీ. అయితే ఎక్కువగా గెస్ట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నందుకు కారణం ఏంటి అని, ‘భోళా శంకర్’లో కూడా గెస్ట్ రోల్ ఎందుకు చేశారు అని ప్రశ్నించారు కొండేటి. ‘‘చిరంజీవి లాంటి హీరో సరసన అలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. నేను హీరోయిన్‌గా సినిమాలు చేసి చాలాకాలం అయ్యింది కాబట్టి స్క్రీన్‌పై ఉండాలి అన్న ఆశతో గెస్ట్ రోల్స్‌ను ఒప్పుకుంటున్నాను’’ అని అసలు విషయం చెప్పింది రష్మీ. ఇక ట్రైలర్ చివర్లో ఎవరికి ముద్దుపెట్టారు అంటే డీఓపీకి పెట్టాను అని రష్మీ నవ్వుతూ సమాధానమిచ్చింది.


కన్నడ సినిమాకు తెలుగు టచ్..
సినిమాలో కంటెంట్ బాగుంటే డబ్బింగ్ చిత్రం అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరె’ అనే కన్నడ చిత్రం.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా కూడా శాండిల్‌వుడ్‌లో చిన్న సైజ్ సెన్సేషన్ సృష్టించింది. అందుకే దీనిని ‘బాయ్స్ హాస్టల్’ టైటిల్‌తో తెలుగులో డబ్ చేశారు. నితిన్ కృష్ణమూర్తి అనే డెబ్యూ డైరెక్టర్‌ను నమ్మి యంగ్ హీరో రక్షిత్ శెట్టి.. ఈ మూవీని కన్నడలో సమర్పించారు. కన్నడలో హిట్ అయినందుకు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసినా కూడా ఇందులో నటించిన ఒక్కరు కూడా తెలుగువారికి తెలియదు. అందుకే యాంకర్ రష్మీ, తరుణ్ భాస్కర్ పాత్రలను ఇందులో స్పెషల్‌గా యాడ్ చేశారు. ఇక ఈ డబ్బింగ్ చిత్రం ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.


Also Read: శోభన, తిరుల స్నేహానికి ఏడాది - ధనుష్, నిత్యా మీనన్ ఆసక్తికర పోస్ట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial