Rana Daggubati: ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్... చోటా సినిమాకు రానా దగ్గుబాటి సపోర్ట్!

Khel Khatam Darwajaa Bandh: చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వడంలో విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఎప్పుడూ ముందు ఉంటారు. లేటెస్టుగా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' చిత్రానికి ఆయన సపోర్ట్ అందించారు.

Continues below advertisement

ప్రేక్షకుల అంచనాలకు, ఊహలకు అందని నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తనను తాను ఒక ఇమేజ్ ఛట్రంలో బందీ చేసుకోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తుంటాడు. ఎట్ ద సేమ్ టైమ్... డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు సపోర్ట్ అందిస్తారు. లేటెస్టుగా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' సినిమాకు ఆయన తన సపోర్ట్ అందించారు. 

Continues below advertisement

రాహుల్ విజయ్ సినిమా ఫస్ట్ లుక్!
'సూర్యకాంతం', 'పంచతంత్రం', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలతో ప్రేక్షకులలో తనకు ఓ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay). ఈ యువ కథానాయకుడు నటిస్తున్న తాజా సినిమా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' (Khel Khatam Darwajaa Bandh Movie).

రాహుల్ విజయ్ హీరోగా 'డియర్ మేఘ', 'భాగ్ సాలే' వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. ఆ సంస్థ మీద అర్జున్ దాస్యన్ 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సంస్థలో నాలుగో చిత్రమిది. ఇందులో రాహుల్ విజయ్ సరసన నేహా పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో అశోక్ రెడ్డి కడదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' సినిమా ఫస్ట్ లుక్, ఇంకా టైటిల్ పోస్టర్ విడుదల అయ్యాయి. లుక్ బావుందని, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టైల్ డిజైన్ తనకు నచ్చిందని ఆయన చిత్ర బృందంతో చెప్పడంతో పాటు సినిమా విజయం సాధించాలని బెస్ట్ విషెస్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.

Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?


Khel Khatam Darwajaa Bandh Movie Cast And Crew: రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, మురళీ ధర్ గౌడ్, 'గెటప్' శ్రీను, 'రచ్చ' రవి, రవి వర్మ, 'బిగ్ బాస్' గంగవ్వ, జయ శ్రీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కో డైరెక్టర్: ఉమేష్ నాగప్పగారి, కాస్ట్యూమ్స్: స్ఫూర్తి రావు, కళా దర్శకుడు: మోహన్ జి, నృత్య దర్శకత్వం: ఈశ్వర్ పెంటి, కూర్పు: ఉదయ్ కుమార్ డి, క్రియేటివ్ హెడ్: బాబ్ సునీల్, ఛాయాగ్రహణం: కార్తీక్ కొప్పెర, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాత: అర్జున్ దాస్యన్, దర్శకత్వం: అశోక్ రెడ్డి కడదూరి.

Also Read: జనక అయితే గనక ఓటీటీ... రైట్స్ అమ్మేసిన దిల్ రాజు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Continues below advertisement