Ramya Krishna Watched Rajinikanth Padayappa Movie In Theater : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ 'నరసింహ'. తమిళ మూవీ 'పడయప్ప'ను తెలుగులో రీమేక్ చేశారు. 1999లో వచ్చిన ఈ మూవీ రజనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తలైవా తన 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా 'పడయప్ప' ఈ నెల 12 థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.
పడయప్పను చూసిన రమ్యకృష్ణ
తాజాగా ఈ మూవీని రమ్యకృష్ణ థియేటర్లో చూశారు. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ... 'ఫస్ట్ టైం 'పడయప్ప' మూవీని థియేటర్లో చూశాను.' అంటూ రాసుకొచ్చారు. ఈ మూవీలో ఐకానిక్ సీన్ అంటే రజనీకాంత్, రమ్యకృష్ణదే అని చెప్పాలి. సినిమాలో 'నీలాంబరి'గా నెగిటివ్ రోల్‌లో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు.
ఐకానిక్ సీన్ ఇదే...
సినిమాలో 'నరసింహ'తో ప్రేమ, పెళ్లి సక్సెస్ కాకపోవడంతో అతనిపై పగతో అజ్ఞాతంలోకి వెళ్తుంది నీలాంబరి. తన గది నుంచి అజ్ఞాత వాసం వీడిన తర్వాత తన తండ్రి చావుకు కారణమయ్యారని పగ తీర్చుకునేందుకు 'నరసింహ'ను దెబ్బ కొట్టేందుకు తన మేనల్లుడిని నరసింహ కూతురిని ప్రేమించేలా చేస్తుంది నీలాంబరి. ఆ విషయం మాట్లాడేందుకు నీలాంబరి ఇంటికి వస్తాడు 'నరసింహ'. చాలా ఏళ్ల తర్వాత వారిద్దరూ ఎదురుపడే సీన్, డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ ఐకానిక్ సీన్‌ను ఫ్యాన్స్‌తో పాటు రమ్యకృష్ణ థియేటర్లో ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
Also Read : ఇయర్ ఎండింగ్ సూపర్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ - క్రిస్మస్ బరిలో యంగ్ హీరోస్ మూవీస్... ఓ లుక్కేయండి మరి!