Balakrishna Workouts For Younger Look In NBK111 Movie : 'అఖండ 2' సక్సెస్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వారి జోష్ మరింత పెంచేలా నెక్స్ట్ మూవీ 'NBK111' రెడీ కానుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న ఈ హిస్టారికల్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
బాలయ్య యంగ్ లుక్?
ఈ మూవీ గురించి తాజాగా ఓ లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. 'NBK111'లో బాలయ్య డ్యుయెల్ రోల్ చేయబోతున్నారట. ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్‌లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్నారట. గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటే ఆయన 'మహారాజు'గానూ కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అప్డేట్స్ రానున్నాయి.
Also Read : ఒకే పాటలో చిరు, వెంకీ స్టెప్పులు - 'మన శంకర వరప్రసాద్ గారు' సాంగ్ సూపర్ అప్డేట్
సాంగ్ పాడనున్న బాలయ్య
ఈ మూవీతో మరోసారి బాలయ్య సింగర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'పైసా వసూల్' మూవీలో 'అరె మామా ఏక్ పెగ్ లా' పాట పాడి అలరించారు. లేటెస్ట్ మూవీలో ఓ పాటను బాలయ్యే స్వయంగా పాడనున్నారట. అంతే కాదు ఈ పాట 'బాహుబలి'లో దలేర్ మెహందీ పాడిన 'సాహోరే బాహుబలి' పాటలా ఉంటుందట. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
క్రేజీ టైటిల్?
'NBK111' మూవీకి క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు 'మహారాజు' అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో పాటు బాలయ్య మహారాజు గెటప్‌లో కనిపించే ఛాన్స్ ఉండడంతో ఆ టైటిల్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మూవీలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. 'మహారాణి' పాత్రలో ఆమె కనిపించనుండగా ఇటీవల రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ కూడా పవర్ ఫుల్ స్టోరీతో డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.