తెలుగు సినిమా పరిశ్రమలో ద్విపాత్రాభినయం అనే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నటుడు నందమూరి తారకరామారావు. ‘రాముడు భీముడు’ సినిమాతో మొదలు పెట్టిన ఈ డ్యుయెల్ రోల్ పద్దతి, ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కొనసాగించారు. ఎన్టీఆర్ నటించిన దాదాపు 300 చిత్రాల్లో.. సుమారు 30కు పైగా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారంటే మీరు నమ్ముతారా? కొన్ని సినిమాల్లో ఆయన త్రిపాత్రభినయం కూడా చేశారు. ఆ జాబితాను ఇక్కడ చూడండి. 


రాముడు భీముడు


ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'రాముడు - భీముడు'. 1964లో విడుదలైన ఈ సినిమాకు  తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరుపై రామానాయుడు నిర్మించబడిన తొలిచిత్రం. అప్పటికి తెలుగులో హీరోల ద్విపాత్రాభినయ చిత్రాలు ప్రారంభం కాలేదు. డీవీ నరసరాజు రాసిన ఈ కథకు ఎన్టీఆర్ కథానాయకుడైతే సమంజసంగా ఉంటుందని భావించారు రామానాయుడు. అయితే, ద్విపాత్రాభినయం అనే ప్రయోగాన్ని బయట నిర్మాతల చిత్రాల్లో కాకుండా తన బ్యానర్‌లో నిర్మించే చిత్రంలో రాముడు, రావణాసురుడు పాత్రలని తనే వెయ్యాలనుకున్నారు ఎన్టీఆర్. కానీ, పట్టువదలని రామానాయుడు, నరసరాజు చేత ఎన్టీఆర్ కు కథ చెప్పించారు. కథలో గొప్పతనాన్ని గుర్తించిన ఎన్టీఆర్ ఈ సినిమా చేసేందుకు ఒకే చెప్పారు. ‘రాముడు భీముడు’ సినిమా అద్భుత విజయం సాధించింది. నిర్మాతగా రామానాయుడు నిలబడేందుకు ఈ సినిమా ఎంతో సహకరించింది.   


అగ్గి పిడుగు


1964లో విడుదలైన ‘అగ్గి పిడుగు’ చిత్రాన్ని  శ్రీ వైటల్ కంబైన్స్ బ్యానర్‌పై బి. విట్టలాచార్య నిర్మించి దర్శకత్వం వహించారు. రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. NT రామారావు , కృష్ణ కుమారి, రాజశ్రీ నటించారు.  


పిడుగు రాముడు


విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1966లో విడుదలై చక్కటి విజయాన్ని అందుకుంది.  డివిఎస్ రాజు ఈ మూవీని నిర్మించారు. ఎన్టీ రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.  టీవీ రాజు స్వరాలు సమకుర్చారు.


డాక్టర్ ఆనంద్


1966లో విడుదలైన ఈ సినిమాను రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. వెంకటపతి రెడ్డి నిర్మించారు.  వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, అంజలిదేవి, కాంచన నటిచారు. కెవి మహదేవన్ సంగీతం అందించారు.   


గోపాలుడు భూపాలుడు


1967లో విడుదలైన ఈ సినిమాను గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. భావనారాయణ నిర్మించారు. జి. విశ్వనాథన్ దర్శకత్వం వహించారు. కోదండపాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్, జయలలిత, రాజశ్రీ కలిసి నటించారు.


భలే తమ్ముడు


1969లో విడుదలైన ఈ యాక్షన్ క్రైమ్ చిత్రాన్ని బీఏ సుబ్బారావు తెరకెక్కించారు. టీవీ రాజు సంగీతం అందించారు. ఎన్టీఆర్, కేఆర్ విజయ కలిసి నటించారు.   


శ్రీకృష్ణ సత్య


1971లో విడుదలైన ఈ సినిమాకు కేవీరెడ్డి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, జయలలిత కలిసి నటించారు. పెండ్యాల సంగీతం అందించారు.  కెవి రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇది కావడం విశేషం.


మా ఇద్దరి కథ


1977లో నందమూరి రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, మంజుల, జయప్రద నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు.   


మంగమ్మ శపథం


ఈ చిత్రాన్ని డీవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డీవీఎస్ రాజు నిర్మించారు. విఠలాచార్య దర్శకత్వం వహించారు. రామారావు, జమున నటించారు. టీవీ రాజు సంగీత అందించారు.  


నిర్దోషి


ఈ క్రైమ్ డ్రామా చిత్రాన్ని శ్రీ గౌతమి పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్. రామబ్రహ్మం నిర్మించారు. వి.దాదా మిరాసి దర్శకత్వం వహించారు. రామారావు, సావిత్రి నటించారు, ఘంటసాల సంగీతం అందించారు.


తిక్క శంకరయ్య


ఈ కామెడీ చిత్రానికి యోగానంద్ దర్శకత్వం వహించగా డీవీఎస్ రాజు నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్, కృష్ణ కుమారి, జయలలిత నటించారు. టీవీ రాజు సంగీతం అందించారు.  


గండికోట రహస్యం


విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1969లో విడుదలైన చక్కటి విజయాన్ని అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జయలలిత నటించారు. టీవీ రాజు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ‘భాగవత్’ పేరుతో హిందీలోకి డబ్ చేశారు.  


కులగౌరవం


1972లో విడుదలైన ఈ సినిమాను రామకృష్ణ ఎన్.ఎ.టి కంబైన్స్ పతాకంపై ఎన్. త్రివిక్రమ రావు నిర్మించారు.  పేకేటి శివరాం దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్, ఆరతి ప్రధాన పాత్రల్లో నటించారు. టి.జి.లింగప్ప సంగీతాన్ఇన అందించారు.  


వాడే వీడు


1973లో విడుదలైన ఈ సినిమాను శ్రీ గౌతమి పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్. రామబ్రహ్మం నిర్మించారు. యోగానంద్ దర్శకత్వం వహించారు. సత్యం సంగీతం అందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మంజుల నటించారు.


తాతమ్మ కల


1974లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో రామారావు, భానుమతి, బాలకృష్ణ నటించారు. రాజేశ్వరరావు సంగీతం అందించారు.   


మనుషులంతా ఒక్కటే


1976లో విడుదలైన ఈ సినిమాను ఆదిత్య చిత్ర బ్యానర్‌పై దుడ్డు వెంకటేశ్వరరావు, మహేష్ నిర్మించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్, జమున, మంజుల నటించారు. రాజేశ్వర రావు సంగీతం అందించారు.   


దాన వీర శూరకర్ణ


తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత రికార్డులు నెలకొల్పిన చిత్రం ఇది. కేవలం 43 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల అయ్యింది. 1977లో విడుదలైన ఈ సినిమాను ఎన్టీఆర్, కొండవీటి వెంకటకవి కలిసి రూపొందించారు. కేవలం రూ. 10 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు, రూ.1 కోటి వసూలు చేసింది. ఇందులో ఆయన మొత్తం 3 పాత్రలు పోషించారు.


శ్రీరామ పట్టాభిషేకం


రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో రామారావు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రాముడిగా, రావణుడిగా ఎన్టీఆర్ నటించారు. తొలిసారి నాయకుడు, ప్రతినాయకుడిగా నటించిన ఘనత కూడా ఎన్టీఆర్ కే దక్కుతుంది.  


యుగంధర్


1970లో విడుదలైన ఈ సినిమాను అమితాబ్ సూపర్ హిట్ సినిమా 'డాన్' ఆధారంగా తెలుగులో నిర్మించారు. ఈ చిత్రానికి కెయెస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరపరిచిన ఎన్టీఆర్ ఏకైక చిత్రం ఇదే.


రాముని మించిన రాముడు


1975 లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎంఎస్ గోపీనాథ్, ఎన్. భక్తవత్సలం రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బ్యానర్ లో నిర్మించారు. గోపీనాథ్ దర్శకత్వంలో నిర్మించారు. ఎన్టీఆర్, వాణిశ్రీ కలిసి నటించారు. చలపతిరావు సంగీతం అందించారు.  


శ్రీమద్విరాటపర్వము


ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 1979లో విడుదలైన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది.


సర్దార్ పాపారాయుడు


దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం ఇది.  1980లో విడుదలైన ఈ సినిమాను క్రాంతి కుమార్ నిర్మించారు. ఎన్టీఆర్, శ్రీదేవి, శారద నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు.  


సర్కస్ రాముడు


1980లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామాను KC ఫిల్మ్స్ బ్యానర్‌పై కోవై చెజియస్ నిర్మించారు. దాసరి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, జయప్రద నటించారు. కేవీ మహదేవన్ సంగీతం అందించారు.  


గజదొంగ


1981లో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ చిత్రాన్ని విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు నిర్మించారు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ కలిసి నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు.  


కొండవీటి సింహం


1981లో విడుదలైన ఈ యాక్షన్ చిత్రాన్ని రోజా మూవీస్ బ్యానర్‌పై M. అర్జున రాజు, K. శివరామ రాజు నిర్మించారు. కే, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు కలిసి నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  


ప్రేమసింహాసనం


1981లో విడుదలైన ఈ సినిమాను తిరుపతి ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ బ్యానర్ లో విద్యాసాగర్ నిర్మించారు.  బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ రతి అగ్నిహోత్రి కలిసి నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.  


విశ్వరూపం


1981, జూలై 25న విడుదలైన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. రామారావు, జయసుధ, అంభిక కలిసి నటించారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలికావద్దనే సందేశాన్నిస్తూ ఈ సినిమా రూపొందింది.   


జస్టిస్ చౌదరి


కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1982లో విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు శ్రీదేవి, శారద కలిసి నటించారు.  


బొబ్బిలిపులి


దాసరి నారాయణరావు  దర్శకత్వం వహించిన ఈ సినిమా 1982లో విడుదలైంది.  J. V. రాఘవులు సంగీతం అందించారు.   రామారావు, శ్రీదేవి నటించారు. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 3.5 కోట్లు వసూలు చేసి పెద్ద హిట్‌గా నిలిచింది.  


చండ శాసనుడు


1983లో విడుదలైన ఈ సినిమాను రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రామారావు, రాధ కలిసి నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఎన్టీఆర్ సీఎం కావడానికి ముందు నటించిన చిత్రం ఇదే.   


శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర


1984లో విడుదలైన ఈ సినిమా  శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాను ఎన్టీఆర్, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందించారు. ఈ చిత్రంలో బుద్దుడు, వేమన, రామానుజులు, ఆదిశంకరుల పాత్రలను ఎన్టీఆర్ పోషించారు. బాలకృష్ణ, రతి అగ్నహోత్రి, కాంచన నటించారు.   


సామ్రాట్ అశోక


ఈ చారిత్రక చిత్రం 1992లో విడుదల అయ్యింది. రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్, వాణీ విశ్వనాథ్ కలిసి నటించారు. విశ్వనాథన్ సంగీతం అందించారు.