ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతుంది. అందుకు కారణం బన్నీకి నేషనల్ అవార్డు రావడమే. ఆగస్టు 25న 69వ జాతీయ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా. ఈ అవార్డ్స్ లో 'పుష్ప' సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకొని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. 70 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి మాత్రమే దక్కడం విశేషం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. బన్నీ నివాసానికి విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు.


అలాగే అల్లు అర్జున్ కి ఎంతో దగ్గర సన్నిహితుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా కంగ్రాచ్యులేట్ చేశారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. ఈ మేరకు రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్ ని కూడా రిలీజ్ చేశారు. చరణ్ ఆ స్పెషల్ నోట్ లో పేర్కొంటూ.." పుష్ప టీంకు డబుల్ కంగ్రాట్స్. నా సోదరుడు అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కు నా శుభాకాంక్షలు" అంటూ తెలిపారు.






అంతేకాకుండా ' ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను అవార్డులు అందుకున్న ఆరుగురుని, ఉప్పెన మూవీ టీం ని, ఆలియా భట్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ, భారతీయ సినిమా మరింత గర్వపడేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ సైతం అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం పై స్పందిస్తూ.. "70 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటిసారిగా సోదరుడు అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమమై నటుడుగా అవార్డు దక్కడం నటుడిగా ఎంతో గర్వపడుతున్నాను. అల్లు అర్జున్ కి నా శుభాకాంక్షలు" అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.


శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ‘‘తెలుగు సినిమా సత్తాను దేశ, విదేశాలలో చాటాం. విదేశీయులు కూడా మన తెలుగు సినిమాలు చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆ స్థాయికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేరుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. పుష్ప సినిమాతో పాటు 'ఆర్ ఆర్ ఆర్', 'ఉప్పెన' సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు దక్కడం తెలుగువారికి ఎంతో గర్వకారణం. ఈ స్ఫూర్తితోనే తెలుగు సినిమా పనిచేయాలి’’ అని బాలయ్య సూచించారు. దీంతో బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద 69వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు తమ సత్తా చాటాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా జాతీయ పురస్కారాలు మన తెలుగు చిత్ర పరిశ్రమకి రావడం అరుదైన ఘనత అని చెప్పొచ్చు.


Also Read : ముద్దు, శృంగార సన్నివేశాలు చేయడంపై ఎట్టకేలకు స్పందించిన అమిషా పటేల్




Join Us on Telegram: https://t.me/abpdesamofficial