"ఆయుధం మీద ఆధారపడిన నీలాంటి వాడి ధైర్యం... వాడి ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం... అణువణువునా ఉంటుంది" అని మాస్ మహారాజ రవితేజ అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. అందులోని డైలాగ్ ఇది. ఇక, "నేరస్థులకు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా స‌రే" అని చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ చెబుతోంది.


'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. టీజర్ చూస్తే... ఆయనది డిప్యూటీ కలెక్టర్ రోల్ అని అర్థం అవుతోంది. ఇసుక మాఫియాను డిప్యూటీ కలెక్టర్ టార్గెట్ చేసినట్టు విజువల్స్ చూస్తే తెలుస్తోంది. ఇంకా ఇతర సమస్యల మీద కూడా రామారావు పాత్ర పోరాటం చేస్తుందని తెలిసింది. రవితేజ తో పాటు హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, మిగతా పాత్రధారులు తనికెళ్ల భరణి, వీకే నరేష్, రాహుల్ రామకృష్ణ, వేణు తొట్టెంపూడి తదితరులను కూడా టీజర్ లో చూపించారు.


Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?


శరత్ మండవ దర్శకత్వంలో  ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.


Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!