'ఇస్మార్ట్ శంకర్'తో హీరో రామ్‌కు మాంచి మార్కెట్ పొటెన్షియల్ ఉందనేది తెలిసి వచ్చింది. సరైన మాస్ సినిమా పడితే... మినిమమ్‌లో మినిమమ్ రూ. 50 కోట్లు వస్తాయి. హిట్ టాక్ వస్తే రూ. 75 కోట్లు గ్యారంటీ. హిందీలో మార్కెట్ ఉంది కాబట్టి డిజిటల్, శాటిలైట్ రైట్స్ బాగా వస్తాయి. అందుకని, రామ్ మీద ఖర్చు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అందుకు, ఉదాహరణ 'ది వారియర్' సినిమాలో 'బుల్లెట్...' సాంగ్.
Bullet Song - The Warriorr Movie: రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో కృతి శెట్టి కథానాయిక. వీళ్ళిద్దరి మీద 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్... ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్' అని ఒక పెప్పీ ఎనర్జిటిక్ సాంగ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ శింబు పాడాడు. శుక్రవారం సాంగ్ విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ప్రోగ్రామ్‌లో తమిళ్ సాంగ్‌ను హీరో, ఎమ్మెల్యే, సీయం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విడుదల చేశారు.
ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్తమిది. చెన్నై ప్రోగ్రామ్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో 'బుల్లెట్' సాంగ్ తెరకెక్కించినట్లు దర్శకుడు లింగుస్వామి చెప్పుకొచ్చారు. సినిమానూ గ్రాండ్‌గా తీశారన్నారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా తీస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. రామ్‌తో ఇంతకు ముందు పరిచయం లేదని, ఈ కార్యక్రమంలో కలిసిన ఐదు నిమిషాల్లో ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.
తమిళంలోనే తన తొలి సినిమా చేయాల్సిందని, ఇప్పటికి కుదిరిందని చెప్పిన రామ్... తనకు తమిళ్ మాట్లాడటం వచ్చని, చెన్నైలో పెరిగానని వివరించారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన మంచి పనులను ఆయన కొనియాడారు. లింగుస్వామి కథ చెప్పినప్పుడే ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నట్టు చెప్పారని రామ్ తెలిపారు.
Also Read: నేను తప్పు చేయలేదు, అరెస్ట్ కాలేదు, ఎక్కడికీ పారిపోలేదు - నగరి కేసుపై జీవితా రాజశేఖర్ స్పందన
ఈ కార్యక్రమంలో దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ఆది పినిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Also Read: 'నా పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసింది' - 'కేజీఎఫ్2' సినిమాపై సంజయ్ దత్ కామెంట్స్