Ram Gopal Varma Wishes to CBN and Pawan Kalyan: ఈసారి ఏపీ ఎన్నికలు ఫలితాలు అందరిని సర్‌ప్రైజ్‌చేశాయి. రాష్ట్ర ప్రజలు ఊహించని విధంగా తీర్పు ఇచ్చారు. ఫలితాల వెల్లడి వరకు సర్వేలు కూడా తేల్చేలేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికలు ఆసక్తిని సంతరించుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ, కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవే చెప్పాయి. కానీ, నేడు వెల్లడైన ఫలితాలు అందరి అంచాలు, సర్వేలను తారుమారు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలంత కూటమికే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందాయి.


ఆర్జీవీ షాకింగ్ ట్వీట్


ఇక కూటమి విజయంసై తాజాగా వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. ఈ 2024 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, జనసేన, నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. "కంగ్రాట్స్‌ @ncbn, @naralokesh,@PawanKalyan" అంటూ ఫైర్‌ ఎమోజీలను జత చేశాడు. దీంతో ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్‌ ఆసక్తిని సంతరించుకుంది. మొదటి నుంచి చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ ట్వీట్‌ చేసే ఆర్జీవీ.. ఇప్పుడు వారికి విషెస్‌ తెలపడం నెట్టింట చర్చనీయాంశమైంది. 


కాగా రామ్‌ గోపాల్‌ వర్మ ముందు నుంచి టీడీపీ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే.





ఎన్నోసార్లు ఆయన చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో  టీడీపీకి వ్యతిరేకత పెరిగేలా, ఓట్లు చీలిపోయేలా వ్యూహం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు వెన్నుపోటు మరోసారి ప్రజలకు గుర్తు చేసి వైసీపీకి ప్లస్‌ అయ్యేలా చేశారు. అంతేకాదు గతంలో లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌ పేరుతోనూ చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. వ్యూహం సినిమాను పూర్తిగా వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా తీసి ఎన్నికల సయమంలో రిలీజ్‌ చేశారు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతు తెలుపుతూ.. టీడీపీ, జనసేన విమర్శ అస్త్రలతో విజృంభించారు. కానీ ఈ ఎన్నికల్లో ఆర్జీవీ వ్యూహం ఏది ఫలించలేదు. ఇక కూటమిపై ఎప్పుడూ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేసే ఆర్జీవీ ఇప్పుడు పేరు పేరు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది. 


Also Read: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..