Ram Gopal Varma: ఒక కామన్ మ్యాన్‌ను హత్య చేయించాడనే ఆరోపణలతో కన్నడ స్టార్ హీరో దర్శన్.. జైలుకు వెళ్లడం సంచలనంగా మారింది. అసలు రేణుకా స్వామి ఎవరు, దర్శన్ ఎందుకు ఈ హత్య చేయించాడు అనే ప్రశ్నలకు సమాధానంగా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పలువురు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. మరికొందరు మాత్రం ఇలాంటి ఒక స్టార్ హీరో తన ఫ్యాన్స్‌ను అడ్డం పెట్టుకొని హత్య చేయించడం కరెక్ట్ కాదని చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు.


మర్డర్ కేసుపై ట్వీట్..


దర్శన్ కేసుపై తన స్టైల్‌లో స్పందిస్తూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘‘స్క్రీన్ ప్లే ఫైనల్ అయిన తర్వాతే ఫిల్మ్ మేకర్ అనేవాడు షూటింగ్ ప్రారంభిస్తాడు. కానీ చాలాసార్లు ఒకవైపు షూటింగ్ జరుగుతున్నా మరోవైపు రైటింగ్‌లో బిజీగా ఉంటారు. దర్శన్ మర్డర్ కేసులో సినిమా విడుదలయిన తర్వాత స్క్రీన్ ప్లే రాయడం మొదలయ్యింది’’ అంటూ ట్విటర్‌లో షేర్ చేశాడు ఆర్జీవీ. అంతే కాకుండా రేణుకా స్వామిని హత్య చేయించడం కోసం దర్శన్ తన ఫ్యాన్స్‌నే ఉపయోగించుకోవడంపై కూడా ఆయన స్పందించారు. హీరోలను దేవుళ్లుగా భావించడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.






ఇదొక వ్యాధి..


‘‘ఒక స్టార్ హీరో తన పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకుంటున్న ఒక డై హార్డ్ ఫ్యాన్‌ను హత్య చేయడం కోసం మరో డై హార్డ్ ఫ్యాన్‌ను రంగంలోకి దించడం అనేది స్టార్లను దేవుళ్లుగా పూజించే వ్యాధికి మంచి ఉదాహరణ. అంతే కాకుండా స్టార్లే తమ జీవితాలు ఎలా సాగాలో నిర్ణయించాలి అనుకోవడం కూడా ఈ వ్యాధిలో భాగమే’’ అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. స్టార్ హీరోలు అందరూ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్‌లాగా ఉంటూ ఫ్యాన్స్‌ను కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉండమని చెప్తున్నా.. ఫ్యాన్ వార్స్ అనేవి ఆగడం లేదు. అలా ఫ్యాన్ వార్స్ చేసేవారికి కూడా ఆర్జీవీ చేసిన ట్వీట్ వర్తిస్తుందని నెటిజన్లు అంటున్నారు.






Also Read: సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి.. ఇదే నా నెంబర్: అజయ్ ఘోష్