Ram Gopal Varma Opens Up on How Multiple Stars 'Burden' a Movie: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. త‌న మ‌న‌సులో ఏమి అనుకుంటాడో అది చెప్తాడు. ఎప్పుడూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేస్తుంటాడు. ఎవ‌రి గురించి ఆలోచించ‌డు. ఇక ఇప్పుడు ఆయ‌న మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అన్ని భాష‌ల వాళ్లు సినిమాలు చూస్తార‌నే ఉద్దేశంతో చాలామంది స్టార్స్ ని పెట్టుకుని సినిమాలు చేస్తున్నార‌ని, అది భారం త‌ప్పితే మ‌రేం లేద‌ని అన్నారు. 'బాహుబ‌లి' సినిమాలో తెలుగు వాళ్లు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ స‌క్సెస్ అయ్యింద‌ని ఉదాహ‌రించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 


యాక్టర్లని కాదు.. స్టోరీ చూసి వస్తారు..


రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. “అలాంటి సినిమాల‌ని ప్ర‌పోజ‌ల్ సినిమాలు అనాలి. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి యాక్ట‌ర్ ఉన్నాడంటే.. ఆ ప్రాంతం వాళ్లు సినిమా చూస్తార‌నే ఫీలింగ్ లో ఉంటారు. కానీ, అది క‌రెక్ట్ కాదు. బాహుబ‌లి సినిమా దాన్ని నిరూపించింది. 'బాహుబ‌లి' అన్ని భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. కానీ, దాంట్లో ఉంది కేవ‌లం తెలుగు న‌టులు మాత్ర‌మే. ప్ర‌భాస్ సినిమా అయిన‌ప్ప‌టికీ అంద‌రూ ఆ సినిమాని ఆద‌రించారు. సినిమాలో ఉన్న విజువ‌ల్స్, క‌థ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. అంతేకానీ వేరే ప్రాంతాల‌కు చెందినవారు ఉండ‌టం వ‌ల్ల కాదు” అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. 


భారం పెరిగిపోతుంది.. 


“ద‌ర్శ‌కులు ఒక్కో రీజ‌న్ నుంచి ఒక్కొక్క‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల సినిమాపై భారం ప‌డుతుంది. ఎందుకంటే కొంత‌మందికి ఈగో ఉంటుంది. కొంత‌మందికి కొన్ని ప‌ర్స‌న‌ల్ డిమాండ్స్ ఉంటాయి. వాటి ఆధారంగా సినిమా తీయాలి. అప్పుడు ఫోక‌స్ త‌గ్గిపోతుంది. దానివల్లే చాలా మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎస్ ఎస్ రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాని చాలా క‌రెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. అందుకే అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ అయ్యింది. నిజానికి ఆ సినిమా చాలామందికి ఇన్ స్పిరేష‌న్.” బాహుబ‌లి త‌ర్వాత చాలామంది రూ.500 కోట్ల‌తో సినిమా చేస్తే స‌క్సెస్ అవుతాం అనుకున్నార‌ని, కానీ అది క‌రెక్ట్ కాద‌ని, ప్ర‌తి సినిమా ‘బాహుబ‌లి’లా స‌క్సెస్ అవ్వ‌లేద‌ని అన్నారు వ‌ర్మ‌. 


భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను, లో బ‌డ్జెట్ సినిమాల‌ను స‌మ‌తుల్యం చేస్తూ అమీర్ ఖాన్ సినిమాలు చేస్తార‌ని అన్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. “త‌న ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ సినిమాల‌ను చేస్తాడు. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్‌తో 100 మంది ప్రేక్ష‌కుల‌ను చేరుకోగ‌ల‌డని అత‌నికి తెలుసు. అయితే ఒక స‌ముచిత సినిమా కేవ‌లం 20 మందిని మాత్ర‌మే చేరుకోగ‌ల‌ద‌ని కూడా అత‌నికి తెలుసు. దానికి త‌గ్గ‌ట్లుగా ఆయ‌న కృష్టి, పెట్టుబ‌డిని స‌ర్దుబాటు చేస్తాడు” అని అమీర్ ఖాన్ ని పొగిడాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 


“ప్ర‌భాస్ న‌టించిన ‘రాధేశ్యామ్’ సినిమా నిజానికి చిన్న సినిమా. కానీ, దాని మీద చాలా ఖ‌ర్చు చేశారు. ఆ సినిమా కాన్సెప్ట్, రిప్ర‌జంటేష‌న్ రెండూ ‘బాహుబ‌లి’తో స‌మానంగా ఉండ‌వు. అలాంటి సినిమాలు విఫ‌ల‌మైతే స్టార్స్ అలాంటి సినిమాలు మ‌ళ్లీ చేయాలంటే భ‌య‌ప‌డ‌తార‌ు” అని అన్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 


“చిన్న సినిమాకి ఎక్కువ లాభాలు ఆశించి భారీ బ‌డ్జెట్ పెట్ట‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. అవ‌స‌రం లేని చోట్ల సినిమాకి ఎక్కువ ఖ‌ర్చు చేసి స‌మ‌స్య‌ల్లో ప‌డుతున్నారు. న‌ష్టాలు తెచ్చుకుంటున్నారు” అని అన్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 


Also Read: వయనాడ్ విలయం - చలించిపోయిన ‘2018’ హీరో టోవినో థామ‌స్, భారీగా ఆర్థిక సాయం