గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెలలో సెట్స్ మీదకు సినిమాను తీసుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరి, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?


చరణ్ జోడీగా నయా అతిలోక సుందరి
బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా హీరోగా రామ్ చరణ్ 16వది. అందుకని, RC 16ను వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఇందులో కథానాయికగా అతిలోక సుందకి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను ఫైనలైజ్ చేశారు. జాన్వీ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. త్వరలో తన కుమార్తె రామ్ చరణ్ సినిమా కూడా చేస్తుందని ఆయన చెప్పారు.


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?






ప్రజెంట్ తెలుగు హీరోతో జాన్వీ కపూర్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా 'దేవర'లో నటిస్తున్నారు. ఇప్పుడీ రామ్ చరణ్ సినిమా ఆమెకు తెలుగు హీరోతో రెండో పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుంది. 


రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాను సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందుతోంది. భారీ నిర్మాణ వ్యయం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని దర్శక నిర్మాతలు తెలియ‌జేశారు.


Also Readఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?


రామ్ చరణ్ 16వ సినిమాకు రెహమాన్ సంగీతం!
ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా ''హ్యాపీ బర్త్ డే ఇసై పుయల్. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారిని మా సినిమాలోకి స్వాగతిస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొన్నారు.  


సరికొత్త మేకోవర్... సర్‌ప్రైజ్ చేసే లుక్!
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ల ముందు వరుసలో ఉంటుంది. దాని కోసం ఆయన మేకోవర్ కూడా ఉన్నారు. చిట్టిబాబు కంటే 'RC16' సినిమాలో తనది  బెస్ట్ క్యారెక్టర్ అని గతంలో ఒకసారి రామ్ చరణ్ చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ రోల్ కోసం ఆయన స్పెషల్ మేకోవర్ అవుతున్నారట. ఈ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.