రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'కి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. అభిమానులు, ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు చిత్ర బృందం సినిమాను రీ ఎడిట్ చేయాలని డిసైడ్ అయ్యిందట. రిపేర్లు చేసి కొత్త వెర్షన్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే...
జగపతి బాబుతో చరణ్ సీన్లు యాడ్ చేసి...శివ రాజ్ కుమార్ సీన్లు డిలీట్ చేసి కొత్తగా!'పెద్ది' విడుదలైన వెంటనే జాన్వీ కపూర్ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. మరీ దారుణంగా హీరోయిన్ బాడీ పార్ట్స్ మీద ఫోకస్ చేశారని మహిళలు మండిపడ్డారు. ఆ వ్యతిరేకతను గమనించిన బుచ్చిబాబు, మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఏ సన్నివేశాలు అయితే బాలేదని విమర్శించారో... వాటిని డిలీట్ చేశారు. అప్‌డేటెడ్ వెర్షన్ ప్రదర్శిస్తున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్‌కు మూడు నెలల బ్రేక్... అసలు కారణం అదేనా?
'పెద్ది'లో మార్పులు జాన్వీ కపూర్ సన్నివేశాలను డిలీట్ చేయడంతో ఆగలేదు. ఈ సినిమాకు ఇంకా రిపేర్లు చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌ను మరింత గ్రిప్పింగ్‌గా, రేసీగా మార్చేందుకు ఇంకొన్ని సన్నివేశాలను తొలగించి, ఆయా సన్నివేశాల స్థానంలో రామ్ చరణ్, జగపతి బాబు మధ్య సన్నివేశాలను యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం సెకండాఫ్‌లో వచ్చే గౌర్ నాయుడు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొన్నిటిని డిలీట్ చేయబోతున్నారట. ఈ మార్పులు - చేర్పులు పూర్తి అయ్యాక... సినిమాకు రీ సెన్సార్ చేయించి కొత్త వెర్షన్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ వీకెండ్ లోపే కొత్త వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలనేది 'పెద్ది' టీమ్ టార్గెట్.
Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
రామ్ చరణ్ సరసన 'పెద్ది'లో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జగపతి బాబు నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాకు రీ సెన్సార్, రీ ఎడిట్స్ చేయాలని అనుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కొత్త వెర్షన్ వచ్చిన తర్వాత కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.
