Ram Charan To Take Three Months Rest: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' కోసం రెండేళ్ళు కష్టపడ్డారు. నటన పరంగా మానసిక శ్రమ, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం శారీరక శ్రమ పడ్డారు. 'పెద్ది' చిత్రీకరణలో రామ్ చరణ్ చేతికి గాయం కూడా అయ్యింది. అయితే సినిమా కోసం సర్జరీని వాయిదా వేశారు. ఇప్పుడు సినిమా విడుదల కావడంతో పాటు ప్రమోషన్స్ కూడా పూర్తి అయ్యాయి. దాంతో భారీ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.

సుక్కు సినిమాకు ముందు మూడు నెలల బ్రేక్!'పెద్ది' విడుదలకు ముందు నెక్స్ట్ సినిమా ఓకే చేశారు రామ్ చరణ్. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. ఇప్పుడు ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందు మూడు నెలల బ్రేక్ తీసుకోనున్నారు. అదీ ఎందుకంటే... 

''రామ్ చరణ్ సుమారు మూడు నెలల పాటు నటనకు విరామం (యాక్టింగ్ బ్రేక్) ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతాయి. 'పెద్ది' కోసం చరణ్ గత రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ఎంతో శ్రమించారు. ముఖ్యంగా అథ్లెటిక్ లుక్, రెజ్లింగ్ సీన్స్ కోసం ఆయన ఎంతో శ్రమించాల్సి వచ్చింది. షూటింగ్ ఏమీ అంత ఈజీగా జరగలేదు. మధ్యలో గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి, నెక్స్ట్ సినిమా కోసం తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి బ్రేక్ చాలా అవసరమని రామ్ చరణ్ భావిస్తున్నారు'' అని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

Also Read: Allu Arjun Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది'కి అల్లు అర్జున్ రివ్యూ... బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఐకాన్ స్టార్ ట్వీట్

మూడు నెలల విరామ సమయంలో కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలు ముగ్గురితో టైమ్ స్పెండ్ చేస్తారట. ఆ టైంలో కొత్త సినిమా షూటింగ్‌లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారట. అంతే కాదు... నెక్స్ట్ సినిమా క్యారెక్టర్ కోసం ప్రస్తుతం ఉన్న అథ్లెటిక్ బాడీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా రామ్ చరణ్ దృష్టి పెట్టనున్నారు. రామ్ చరణ్ - సుకుమార్ కొత్త చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది.

Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు