ఆగస్టు రేసులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొణిదెల (Varun Tej Konidela) కొత్త సినిమా కూడా చేరిందని టాలీవుడ్ టాక్. ఆగస్టు 14న సూర్య 'విశ్వనాథన్ అండ్ సన్స్', 21న రవితేజ 'ఇరుముడి', 28న శర్వానంద్ 'భోగి' ఉన్నాయి. మరి, వరుణ్ తేజ్ సినిమా ఏ తేదీకి థియేటర్లలోకి రావాలని అనుకుంటుందో తెలుసుకోండి.

Continues below advertisement

ఆగస్టు 7న థియేటర్లలోకి కనకరాజు!Korean Kanakaraju Release Date: తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. కంటెంట్ బేస్డ్ కథలతో ప్రయోగాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలు అందించారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న హారర్ సినిమా 'కొరియన్ కనకరాజు' కూడా ప్రయోగాత్మక చిత్రమే. ఇండో కొరియన్ సంస్కృతుల నేపథ్యంలో యాక్షన్ హారర్ కామెడీగా రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

Also ReadAllu Arjun Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది'కి అల్లు అర్జున్ రివ్యూ... బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఐకాన్ స్టార్ ట్వీట్

Continues below advertisement

వరుణ్ తేజ్ కెరీర్‌లో 'కొరియన్ కనకరాజు' సరికొత్త ప్రయత్నమని చెప్పవచ్చు. ఈ సినిమాను ఆగస్టు 7న థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతానికి ఆ తేదీకి మరో సినిమా ఏదీ లేదు. వరుణ్ తేజ్ సినిమా వచ్చిన వారం తర్వాత సూర్య సినిమా థియేటర్లలోకి రానుంది. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్‌, సెలవులను సద్వినియోగం చేసుకోవాలని 'కొరియన్ కనకరాజు' టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే... యూనిట్ నుంచి విడుదల తేదీపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 'కొరియన్ కనకరాజు' సినిమాలో వరుణ్ తేజ్ సరసన 'మిరాయ్' ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు