Ram Charan Mumbai tour : ‘RRR’ సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని ప్లాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 'RRR' తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోను రామ్ చరణ్ ని అభిమానిస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఈరోజు హైదరాబాద్ నుంచి రాంచరణ్ ముంబై కి పయనమయ్యారు. కాసేపటి క్రితమే ఆయన ముంబై చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి చరణ్ ముంబైకి ఏ పని మీద వెళ్లారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.


ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ దగ్గర రామ్ చరణ్ కనిపించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో రామ్ చరణ్ కొంతమంది ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోతో రామ్ చరణ్ ముంబైలో ఉన్నాడు అనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. రీసెంట్ గానే మైసూర్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన మూవీ టీమ్ తదుపరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ ఈ విషయంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆ మధ్య ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సాంగ్ ని రిలీజ్ చేయలేదు.






ఇదే విషయమై ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.." గేమ్ చేంజర్ ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయింది. వీలైనంత త్వరగా మిగతా పార్ట్ పూర్తి చేస్తాం. రాజమౌళి, శంకర్, సుకుమార్, సందీప్ వంటి దర్శకులు మేకింగ్ విషయంలో అసలు రాజీపడరు. అలాంటి దర్శకులకు డెడెడ్ లైన్స్ పెట్టేసి తొందరగా చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా విషయంలో మంచి క్వాలిటీ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దర్శకుడు శంకర చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పుడే చెప్పలేం. కారణం షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుందో ముందే చెప్పలేము. వాటిపై క్లారిటీ వచ్చాక ఒక నిర్ణయానికి వస్తాము" అంటూ చెప్పుకొచ్చారు.


పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్‌, నవీన్‌ చంద్ర, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2024 ఆఖరిలో లేదా 2025 ప్రారంభంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.


Also Read : బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?