Triptii Dimri on Animal criticism: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషలన్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన ‘యానిమల్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచనల విజయం సాధించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అదే సమయంలో ఈ చిత్రం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా నష్టం కలిగిస్తాయనే చర్చ జరుగుతోంది. ఏకంగా పార్లమెంట్ లో కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు సభ్యులు. ‘యానిమల్’, ‘కబీర్ సింగ్’ లాంటి మూవీస్ పిల్లల మనసులో తీవ్ర ద్వేషాన్ని, హింసను, లైంగిక రాక్షసత్వాన్ని కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ మేకర్స్ సమాజం పట్ల బాధ్యతలను మర్చిపోకూడదని వెల్లడించారు.
నచ్చకపోతే చూడకండి- త్రిప్తి దిమ్రి
‘యానిమల్’ మూవీ మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. సినిమా నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సినిమా కచ్చితంగా చూడాల్సిందేనని ఎవరూ బలవంతం చేయడం లేదన్నారు. సినిమాలను సినిమాల్లాగే చూడాలి తప్ప, అనవసర చర్చ చేయాల్సి అవసరం లేదని వెల్లడించింది. పాత్రల్లోని మానవీయతను మాత్రమే చూడాలని గుర్తు చేసింది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు చూడాలో ఎంచుకునే స్వేచ్ఛ ఉందని, నచ్చని సినిమాలను చూడాల్సిన అవసరం లేదన్నారు. “ ‘యానిమల్’ సినిమా గురించి గత కొద్ది రోజులుగా చర్చ నడుతోంది. ఈ సినిమా సమాజం మీద ప్రభావించ చేస్తుందని చాలా మంది చెప్తున్నారు. వారు చెప్పేదాంట్లో తప్పు లేదు. నచ్చని విషయాల గురించి వారి అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చని విషయాల వైపు వెళ్లకపోవడమే మంచిది. అలాంటి సినిమాలను చూడకండి" అని చెప్పుకొచ్చింది.
మంచిని మాత్రమే తీసుకోండి- త్రిప్తి దిమ్రి
ఇక ‘యానిమల్’ సినిమాలో షూ సీన్ గురించి త్రిప్తి ప్రత్యేకంగా ప్రస్తావించింది. “మీరు యాక్షన్ సినిమాలు చూస్తారు. అందులో విలన్లు హీరోను కొడతారు. అంటే మీరు కూడా మీకు నచ్చని వారిని కొట్టాలని చెప్పడం ఆ సీన్ ఉద్దేశం కాదు. ఎవరైనా మీ గురించి అసభ్యంగా మాట్లాడితే, మీరు ఇంటికి వెళ్లి మీ కుటంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడమని చెప్పడం కాదు. అందుకే, సినిమాను సినిమా లాగే చూడాలి. మంచిని మాత్రం తీసుకుని చెడును వదిలేయాలి” అని వివరించింది.
‘యానిమల్’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న త్రిప్తి
వివాదాస్పద చిత్రం 'యానిమల్'లో త్రిప్తి దిమ్రి సెకెండ్ హీరోయిన్ గా నటించింది. జోయా పాత్రలో చక్కటి నటన కనబర్చింది. హీరో రణబీర్ తో కలిసి ఆమె పలు ఇంటిమేట్ సీన్లలో నటించింది. ఓ సన్నివేశంలో రణబీర్ ఆమెను తన షూ నాకమని చెబుతాడు. ఈ సీన్ చాలామందికి నచ్చలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Read Also: ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ నుంచి ‘మోయే మోయే’ వరకు, 2023లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన టాప్ మీమ్స్ ఇవే!