Ram charan Game Changer Update: శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' 2021 సెప్టెంబర్‌లో ఈ మూవీ లాంచ్‌ అయ్యింది. ఆ తర్వాత మూడు నెలలకు షూటింగ్‌ మొదలైంది. అయితే, అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఫ్యాన్స్‌ ఈ సినిమా గురించి తెగ ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడొక అప్‌డేట్‌ బయటికి వచ్చింది. అదే రామ్‌చరణ్‌ షూటింగ్‌కి సంబంధించి. ఈ ఏడాది పుట్టిన రోజుకు ముందే రామ్‌చరణ్‌ తన షెడ్యూల్‌ పూర్తి చేస్తున్నారట. దీంతో ఫ్యాన్స్‌ అంతా.. ఈ బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. 


పుట్టిన రోజుకు ముందే ప్యాకప్‌..


షూటింగ్‌ మొదలై ఇప్పటికే దాదాపు మూడేళ్లు అవుతోంది.  కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ చాలా లేట్‌ అయ్యింది. రామ్‌చరణ్‌కి దెబ్బ తగలడం, ఆ తర్వాత క్లింకార కోసం బ్రేక్‌ తీసుకోవడం లాంటి వాటివల్ల షూటింగ్‌ లేట్‌ అయ్యిందని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు డైరెక్టర్‌ శంకర్‌ కూడా కమలహాసన్‌ 'భారతీయుడు -2' సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ తన షెడ్యూల్‌ని పుట్టిన రోజుకు ముందే ముగించేస్తున్నారట. ఆయన మీద షూట్‌ చేయాల్సిన సన్నివేవాలన్నీ మార్చి 27కి ముందే కానించేసి, ప్యాకప్‌ చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  


అప్‌డేట్‌ వస్తుందా?
 


పుట్టినరోజుకు ముందే షూటింగ్‌ ముగిస్తారు అంటే.. కచ్చితంగా ఈ బర్త్‌డేకి కచ్చితంగా ఏదో ఒక అప్‌డేట్‌ ఉంటుందని ఫ్యాన్స్‌ అంటున్నారు. దానికోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' తర్వాత చర్రీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో ఈ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి గేమ్‌ ఛేంజర్‌తో ట్రీట్‌ ఇస్తే బాగుండు అని ఫీల్‌ అవుతున్నారు. మరి అప్‌డేట్‌ ఏమైనా ఇస్తారేమో వేచి చూడాలి. మరోవైపు సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత దిల్‌రాజు కూడా చెప్పారు. 'సలార్‌' సినిమా చూసి వస్తున్న ఆయన్ని కొంతమంది ఫ్యాన్స్‌ 'గేమ్‌ ఛేంజర్‌' గురించి అడిగితే.. ఆయన సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేస్తానని చెప్పిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.   


స్పెషల్‌గా కనిపించనున్న రామ్‌చరణ్‌.. 


శంకర్‌ దర్వకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'గేమ్‌ ఛేంజర్‌'. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఒక పవర్‌ఫుల్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నారు. డ్యుయల్‌ రోల్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల రిఫామ్స్‌, ఓటింగ్‌ ప్రాసెస్‌ తదితర అంశాల్లో మార్పు తీసుకొచ్చే ఆఫీసర్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు చర్రీ. అయితే, ఇది ఏ పార్టీని విమర్శించేలా ఉండదని చిత్ర బృందం చెప్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వానీ, అంజలి నటుస్తున్నారు. ఎస్‌. జె.సూర్యా, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ తన బాడీని పూర్తిగా ట్రాన్స్‌ఫామ్‌ చేయనున్నారట. బుచ్చిబాబుతో తన తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం ఆయన ఏప్రిల్‌ నుంచి కసరత్తులు మొదలుపెట్టబోతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే  తర్వాతి సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది.


Also Read: ‘యానిమల్ పార్క్’పై కీలక అప్డేట్ - కథ సిద్ధం, షూటింగ్ ఎప్పుడంటే?