Ram Charan Buys Brand New Luxury Car: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. ఇప్పటికే చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు సమాచారం. ఇక నెక్ట్స్ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబుతో RC16 సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ తాజాగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేపు జరగబోయే అనంత్ అంబాని,రాధిక మర్చంట్ వివాహ వేడుకకు చరణ్ సతీసమేతంగా హాజరుకాబోతున్నాడు.
ఈ నేపథ్యంలో ముంబైకి బయలుదేరిన చరణ్ ఎయిర్‌పోర్ట్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చరణ్ ఓ లగ్జరీ కారు నుంచి దిగాడు. అంతేకాదు స్వయంగా అతడే డ్రైవింగ్ చేసినట్టు కూడా కనిపించాడు. దీంతో అందరి కళ్లు ఆ కారుపై పడ్డాయి. ఏంటీ రామ్ చరణ్ మరో లగ్జీరి కారు కొన్నాడా? అని ఆరా తీయగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగా హీరోలందరికి కార్లు అంటే ఎంత పిచ్చో తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కార్లంటే ఎనలేని ప్రీతి. చిరు కార్ గ్యారేజ్‌లో రోల్స్ రాయిస్ వంటి రాయల్ కారుతో పాటు మరో నాలుగు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా కార్లంటే తండ్రిలాగే పిచ్చి. అందుకే మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను ఎప్పటికప్పుడు తన సొంత చేసుకంటాడు.
హైదరాబాద్ లోనే తొలి వ్యక్తిగా..
తాజాగా ఈ గ్లోబల్ స్టార్ మరో లగ్జీరా కారును తన కార్ల గ్యారెజ్‌లో చేర్చాడు. అదే రోల్స్ రాయిస్ న్యూ వెర్షన్. ఇప్పటికే ఈ బ్రాండ్ కారు తన తండ్రి చిరంజీవికి ఉంది. తాజాగా చరణ్ ఈ బ్రాండ్ న్యూ వెర్షన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా మరో వెర్షన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే రోల్స్ రాయిస్ స్పెక్ట్రా. దీని ధర తెలిస్తే ప్రతి ఒక్కరు అవాక్కావాల్సిందే. అత్యంత ఖరీదైన ఈ కారు మార్కెట్లోకి రాగానే చరణ్ ఆర్డర్ పెట్టేశాడట. జనవరిలో ఈ కార్ విడుదల కాగా.. చరణ్ అప్పుడే బుక్ చేసుకున్నాడు. ఇటీవల ఆ కారు డెలివరి అయినట్టు తెలుస్తోంది. దీని ధర రూ. 7.5 కోట్లు. హైదరాబాద్‌లో ఈ లగ్జరీ కారు కొన్న తొలి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం. ఇక ఇండియాలోనే చరణ్ సెకండ్ పర్సన్ అంట.
చరణ్ కార్ల జాబితా
దీంతో ఇప్పుడంత చరణ్ రోల్స రాయిస్ కారు గురించే చర్చించుకుంటున్నారట. ఇక చరణ్ దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో రూ. 4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLS 600 కారు, కోటి రూపాయల ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ GLE400 కూప్ కారు, రూ. 3.2 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వన్టేజ్ కారు, రూ. 3.5 కోట్ల వాల్యూ ఫెరారీ పోర్టోఫినో కారు, రూ. 2.75 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు.. రూ. 1.75 కోట్లు విలువ చేసే BMW 7 సిరీస్ కార్లు ఉన్నాయట. ఇప్పుడు వాటి పక్కన రూ. 7.5 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ స్పెక్ట్రా రాయల్ కారు కూడా వచ్చి చేరింది.
Also Read: 'వెంకిఅనిల్3' మూవీలో 'యానిమల్' నటుడు - సందీప్ రెడ్డి వంగాకు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్