Peddi Release Date News In Telugu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. 'ఉప్పెన' తర్వాత దర్శకుడు సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల ఎప్పుడు? అంటే... ఏప్రిల్ 30న అని చెబుతారంతా! అయితే... ఆ తేదీకి విడుదల అయ్యే అవకాశాలు లేవని, వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని తొలి పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ సైతం జూన్ 26కు వస్తుందన్నట్టు మాట్లాడారు. ఆ తర్వాత తనది పొరపాటు అని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. దాంతో 'పెద్ది' విడుదలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడీ పుకార్లకు రామ్ చరణ్ చెక్ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...

'పెద్ది' లేట్ అవ్వడం లేదని...'రాకాస' టీంతో రామ్ చరణ్!మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిర్మించిన 'రాకాస' సినిమా ఈ రోజు (ఏప్రిల్ 2, గురువారం) పెయిడ్ ప్రీమియర్లతో విడుదల అవుతోంది. రేపు (ఏప్రిల్ 3, శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. విడుదలకు ముందు 'పెద్ది' సెట్స్‌లో రామ్ చరణ్ (Ram Charan)ను 'రాకాస' టీం కలిసింది.

Also Read: Nidhhi Agerwal: నిధి అగర్వాల్ నెక్స్ట్ సినిమా ఏది? వీరమల్లు, రాజా సాబ్ తర్వాత ఏంటి?

'స్నేక్ డ్యాన్స్' పాటలో హీరోయిన్ నయన్ సారిక డ్యాన్స్ బావుందని రామ్ చరణ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. 'ఇండియానా జోన్స్' తరహాలో సినిమా తీశారని దర్శకురాలు మానసా శర్మను మెచ్చుకున్నారు. వెంటనే ''మనం ఇండియానా జోన్స్ ఫ్యాన్స్ కదా'' అని నిహారిక అన్నారు. అయితే... మాటల మధ్యలో రామ్ చరణ్ లీక్స్ (Ram Charan Leaks) ఏమైనా ఇవ్వమని అడిగారు. అప్పుడు ''పెద్ది' లేట్ అవ్వడం లేదని ప్రమోట్ చెయ్యండి'' అని రామ్ చరణ్ చెప్పారు. విడుదల తేదీపై నెలకొన్న గందరగోళం రామ్ చరణ్ వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. లేట్ అవ్వడం లేదని చెప్పారు గానీ... ఏప్రిల్ 30కు వస్తుందో రావడం లేదో క్లారిటీ ఇవ్వలేదు. లేట్ లేదన్నారు కనుక ఏప్రిల్ 30న వస్తుందని అనుకోవాలి. నిజానికి ఈ సినిమా మార్చి 27న విడుదల కావాలి. అప్పటికి చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఏప్రిల్ 30కు వచ్చారు. అదీ సంగతి!

Also ReadRanjith Arrest: లైంగిక వేధింపుల కేసులో మలయాళ దర్శకుడి అరెస్ట్... అసలు ఏమైందంటే?

'పెద్ది' చిత్రీకరణలో ఇటీవల రామ్ చరణ్ కంటికి గాయమైంది. అయినా సరే సర్జరీ చేయించుకుని మర్నాడు మళ్ళీ సెట్స్‌కు వచ్చారు. సినిమా ఆలస్యం కాకూడదని ఆయన చూపిస్తున్న కమిట్మెంట్ అటువంటిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. త్వరలో మూడో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, తాజాగా విడుదల చేసిన పెద్ది పెహల్వాన్ గ్లింప్స్‌ సైతం మంచి స్పందన రాబట్టుకుంది.

Also ReadAnirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!