Ram Charan New Movie Name 2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సానా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ రూపొందుతోంది. చరణ్ 16వ సినిమా కావడంతో దీనిని RC 16 అంటున్నారు. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ టైటిల్ మార్చే ఆలోచనలో వున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని యూనిట్ వర్గాల టాక్. అసలు, రామ్ చరణ్ సినిమా టైటిల్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
పెద్ది... అవును, సినిమా టైటిల్ ఇదే!
రామ్ చరణ్, బుచ్చి బాబు సానా సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారు. ఆ వార్త సినిమా ప్రారంభం కంటే ముందు ఆ టైటిల్ (RC 16 titled Peddi) కన్ఫర్మ్ చేశారని బయటకు వచ్చింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమాకు ఆ టైటిల్ అయితే చాలా చక్కగా సూట్ అవుతుందని భావించారు. అయితే... గ్లోబల్ లెవల్‌లో చరణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని టైటిల్ మార్చే అవకాశాలు వున్నట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని యూనిట్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. టైటిల్ మార్చే ప్రసక్తి లేదని కన్ఫర్మ్ చేశాయి. సో... ఫ్యాన్స్ 'పెద్ది'కి ఫిక్స్ అయిపోండి.
రామ్ చరణ్ జోడీగా జాన్వీ... రెహమాన్ మ్యూజిక్!
RC 16 Movie Cast And Crew: రామ్ చరణ్, బుచ్చిబాబు చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, కళా దర్శకత్వం: అవినాష్ కొల్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్ కుమార్, యాక్షన్ కొరియోగ్రఫీ: సుప్రీమ్ సుందర్, పాటలు: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ - అనంత శ్రీరామ్ - బాలాజీ, కూర్పు: ఆంటోని రూబెన్.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
'పెద్ది' కంటే ముందు 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు!
త్వరలో 'పెద్ది' చిత్రీకరణ ప్రారంభించడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ఆ సినిమా కంటే ముందు ఆయన 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఆ సినిమాలో చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో పది పదిహేను రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా కూడా పూర్తి అవుతుందని దర్శకుడు తెలిపారు. ఆ తర్వాత విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. మరి, ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే 2025కు వెళుతుందా? అనేది చూడాలి. 'ఇండియన్ 2' జూలై 12న విడుదల అవుతున్నా... ఇంకా మూడో పార్ట్ విడుదల కావాల్సి ఉంది.