Rakul Preet Singh Open Her New Aarambam Restaurant: స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ (Rakul Preet Singh) సింగ్ మరో వ్యాపారంలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బిజినెస్‌లో రాణిస్తున్న ఆమె తాజాగా ఫుడ్‌ బిజినెస్‌ (Rakul Open Restaurant)లోకి అడుగుపెట్టింది. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె తన కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది.హైదరాబాద్‌లో 'ఆరంభం' పేరుతో వేజ్‌ రెస్టారెంట్‌ను లాంచ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రకుల్‌కి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  అందరికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంలో రకుల్‌ ఈ 'ఆరంభం' రెస్టారెంట్‌ని స్టార్ట్‌ చేసిందట.


దీని ద్వారా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఉండనున్నాయి. అన్నీ ఈ రెస్టారెంట్‌లో అన్ని కూడా మిల్లెట్స్‌తో చేసిన వంట‌కాలు ల‌భించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో మిల్లెట్స్‌తో కూడిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, సూప్స్‌, మాల్ట్స్‌ ఇలా అన్ని రకాలు ఫుడ్స్‌ అందించబోతుందట. కాగా ఇప్పటికే ఫిట్‌నెస్‌ రంగంలో సొంతం వ్యాపారం మొదలు పెట్టిన రకుల్‌కు హెల్త్‌ అండ్‌ స్కిన్‌ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ సొంతంగా ఎఫ్‌45(F45) పేరుతో జిమ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. మొదట హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేసి ఈ బిజినెస్‌ను ఆ తర్వాత ఆమె వైజాగ్‌, ముంబై తదితర నగరాల్లోనూ బ్రాంచ్‌లు ఒపెన్‌ చేసింది. ఇక వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.. అలాగే న్యూబ్‌ పేరుతో బయోడీగ్రేడబుల్‌, రీ యూజబుల్‌ డైపర్ల బిజినెస్‌ను కూడా 2019లో లాంచ్‌ చేసింది.






ఇప్పుడు తాజాగా ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఇక రకుల్‌ జోరు చూసి అంతా స్టన్‌ అవుతున్నారు. పెళ్లి తర్వాత ఏదైనా విశేషంతో వస్తుందనుకుంటే.. ఇలా గుడ్‌న్యూస్‌తో వచ్చేసింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌.కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రకుల్‌ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది.  ఈ మధ్య ఇక్క ఆఫర్స్‌ తగ్గడంతో ఇక ముంబైకి మాకాం మార్చింది. అక్కడ సినిమాలు చేస్తూ కెరీర్‌ కొనసాగిస్తున్న ఆమె గత నెల తన బాయ్‌ఫ్రెండ్‌ జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం రకుల్‌ చేతిలో 'ఇండియన్‌ 2' మూవీతో పాటు పలు బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 







Also Read: ఇవాళ, రేపు ఓటీటీలో సినిమాల జాతర, థియేటర్లలో అలరించే మూవీస్ ఇవే!