రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నార్త్ ఇండియన్ అమ్మాయి అయినప్పటికీ... సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. మన తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి యంగ్ స్టార్లు అందరితో సినిమాలు చేశారు. 

Continues below advertisement

సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ ఫిట్నెస్ (Rakul Preet Singh Fitness)కు ఆమె ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది తెలుసు. ఆ విషయంలో మరొక సందేహం అవసరం లేదు. అటువంటి కథానాయికను పట్టుకుని ఆమె అందం వెనుక రహస్యం ప్లాస్టిక్ సర్జరీ అని కామెంట్ చేశారు ఒకరు. సోషల్ మీడియాలో రకుల్ ప్లాస్టిక్ సర్జరీని వివరిస్తూ ఒక వీడియో షేర్ చేశారు. అది రకుల్ దృష్టి వరకు వెళ్ళింది. దాంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అటువంటి డాక్టర్లతో జాగ్రత్త!అటువంటి డాక్టర్లతో జాగ్రత్త అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రకుల్ ఒక పోస్ట్ చేశారు. ఆ స్టోరీలో ఆవిడ ఏమన్నారంటే?... ''నిజనిర్ధారణ చేసుకోకుండా ప్రజలు తప్పు దోవ పట్టించేలా స్టేట్మెంట్లు ఇస్తూ, తమను తాము డాక్టర్లు అని చెప్పుకొనే వ్యక్తులను చూస్తే భయం కలుగుతోంది. ఒక నటిగా నాకు సైన్స్ గురించి తెలుసు. ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నాకు ఎటువంటి సమస్య లేదు. అయితే... వెయిట్ లాస్ అనేది ఒకటి ఉందని, హార్డ్ వర్క్ (జిమ్ లో చెమట చిందించడం వల్ల బరువు తగ్గడం) అనేది ఒకటి ఉంటుందని విన్నారా?'' అని రకుల్ పేర్కొన్నారు. తన ముఖంలో, శరీరాకృతిలో మార్పుల వెనుక కారణం వెయిట్ లాస్ అని ఆవిడ పరోక్షంగా చెప్పారు.

Continues below advertisement

Also ReadPawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు వస్తే... ఈ ఏడాది అజయ్ దేవగణ్ 'దే దే ప్యార్ దే 2'తో ఆవిడ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం హిందీలో మరొక సినిమా 'పతి పత్నీ ఔర్ దో' చేస్తున్నారు. అది కాకుండా ఆవిడ కంప్లీట్ చేసిన 'ఇండియన్ 3' విడుదల కావాల్సి ఉంది.

Also Read: Ravi Teja New Movie: సైన్స్ ఫిక్షన్ జానర్‌ ట్రై చేయనున్న రవితేజ... చిరంజీవి దర్శకుడితో కొత్త సినిమా