రీసెంట్ గా కన్నడలో సెన్సేషన్ ని క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ అగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 'సప్త సాగరాలు దాటి' అనే టైటిల్తో సెప్టెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేయగా, తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా ఎమోషనల్ గా ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది. ప్రియా అనే గాయని మను అనే కార్ డ్రైవర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ జీవితంలో గొప్పగా బతకాలన్న ఆశతో ఓ తప్పటడుగు వేసి చిక్కుల్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది? ఈ సినిమా ప్రధాన కథాంశం.


టీజర్ ని పరిశీలిస్తే.." మను నా ఆశ ఏంటో తెలుసా. ఊర్లో సముద్రం ఉంది కదా. ఆ సముద్రం ఒడ్డున నీతో జీవితాంతం నడుస్తూనే ఉండాలి. అలలు ఒక్కోటి వచ్చి మన పాదాలను తడుపుతూ ఉంటే నేను నీ చేతులు గట్టిగా పట్టుకోవాలి. ఆ అలల శబ్దాన్ని అలా వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తుంది. మను నీకూ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నీతో ఉన్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. నా సముద్రం నువ్వు" అంటూ హీరోయిన్ డైలాగ్ చెప్తుండగా బ్యాగ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ ఎమోషనల్ ఫీల్ ఇచ్చింది. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని టీజర్ తోనే స్పష్టం చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే హార్ట్ హిట్టింగ్ అంతే.


ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇది పార్ట్ వన్ మాత్రమే. ఫస్ట్ పార్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ పార్ట్ ను అక్టోబర్ 20న కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలై కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. చాలా రోజుల తర్వాత ఒక హార్ట్ హిట్టింగ్ సినిమా చూశామని చెప్తూ కన్నడ కల్ట్ క్లాసిక్ మూవీగా కితాబిచ్చారు. అలాంటి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని హేమంత్ అనే దర్శకుడు తెరకెక్కించగా హీరో రక్షిత్ శెట్టి తన సొంత బ్యానర్ పై నిర్మించారు.


కన్నడ ప్రేక్షకులను కంటతడి పెట్టించిన ఈ ఎమోషనల్ లవ్ రైడ్ మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా రక్షిత్ శెట్టికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఒకప్పుడు మన స్టార్ హీరోయిన్ రష్మిక మందన మాజీ ప్రియుడిగా తెలుగులో పాపులర్ అయిన రక్షిత శెట్టి, ఆ తర్వాత తన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ హీరో నటించిన '777 చార్లీ' ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా వైడ్ సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇటీవల నేషనల్ అవార్డు కూడా వచ్చింది.


Also Read : సుధీర్ బాబు 'మామా మశ్చీంద్రా' నుండి 'అడిగా అడిగా' సాంగ్ రిలీజ్ - మీరు విన్నారా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial