Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి అప్డేట్ అడగగా ఒక షాకింగ్ విషయం బయటపెట్టింది. తన గర్భాశయంలో ట్యూమర్ ఉందని తెలిపింది.


బాగానే ఉంది..


తన గర్భాశయంలో 10 సెంటీమీటర్ల ట్యూమర్ ఉందని, దానికోసం సర్జరీ చేయాలని రాఖీ సావంత్ బయటపెట్టింది. మే 18న తనకు సర్జరీ జరగనుందని కూడా చెప్పింది. ముందుగా ఈ ట్యూమర్ గురించి రాఖీ సావంత్ మాజీ భర్త అయిన రితేష్ సింగ్ బయటపెట్టాడు. దీంతో ఫ్యాన్స్ అంతా అది నిజమేనా అని తనను ప్రశ్నించగా తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే అంతా ఓకే అయిపోతుందని చెప్పుకొచ్చింది. దీంతో రాఖీ సావంత్ ట్యూమర్ విషయంలో ప్రస్తుతం బీ టౌన్‌లో వైరల్ అవుతోంది. చాలామంది ఫ్యాన్స్ తను త్వరగా కోలుకోవాలి అంటూ తన సోషల్ మీడియా పోస్టుల కింద కామెంట్స్ పెడుతున్నారు.


నేను డాక్టర్ కాదు..


‘‘నేను త్వరలోనే ఓకే అయిపోతాను. నేను పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నా శరీరంలో 10 సెంటీమీటర్ల ట్యూమర్ ఉంది. దానికోసం శనివారం సర్జరీ జరుగుతుంది. నేను నా ఆరోగ్యం గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేను. కానీ రితేష్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాడు. హాస్పిటల్ గురించి కూడా తనే చెప్తాడు. సర్జరీ అయిపోయిన తర్వాత ట్యూమర్‌ను చూపిస్తాను. నేను సర్జరీ కంటే ముందే ఆసుప్రతిలో అడ్మిట్ అవ్వాలి. ఎందుకంటే బీపీలాంటివి కంట్రోల్‌లో ఉన్నాయా లేదా అని పలు పరీక్షలు చేస్తారు. నాకు దానిగురించి ఇంకా పూర్తి వివరాలు తెలియదు. ఎందుకంటే నేను డాక్టర్ కాదు. యాక్టర్‌ను’’ అంటూ వివరించింది రాఖీ సావంత్.


కచ్చితంగా తిరిగొస్తాను..


‘‘ఈ ట్యూమర్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు. నేను ఇటీవల ఒక ఈవెంట్‌లో టవల్ కట్టుకొని డ్యాన్స్ చేశాను. ఇంటికి వచ్చాక కళ్లు తిరిగి పడిపోయాను. రితేష్ నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్యూమర్ ఉందని తెలిసింది. కానీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి నేను కచ్చితంగా తిరిగొస్తాను’’ అని ఫ్యాన్స్‌కు మాటిచ్చింది రాఖీ సావంత్. తన మాజీ భర్త రితేష్ సైతం ఈ విషయంపై స్పందించాడు. ‘‘రాఖీ ఏం చేసినా కామెడీ అనిపించేలా ఈ సమాజంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఇది మాత్రం కామెడీ కాదు. నన్ను అందరూ తిట్టుకున్నా కూడా నేను తన వెంటే ఉంటాను’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు రితేష్.


Also Read: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ