Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. వందలాది మంది ఆయన అభిమానుల నడుమ బోరబండలోని స్మశాన వాటికలో ఆయన కుమారుడు చరణ్ అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు ప్రముఖ సినీ కొరియోగ్రఫర్ లు ఆయన అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ వైద్యులు ప్రకటించారు. అయితే రాకేష్ మాస్టర్ సన్నిహితులు మాత్రం ఆయనది సహజమరణం కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపి రాకేష్ మాస్టర్ మృతికి గల కారణాలను వెలికి తీయాలని కోరుతున్నారు. తాజాగా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాఖీ భాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ మృతి విషయంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవతున్నాయి.
ఆయన ఫోన్ పోయింది, అక్కడ రెండు బీర్లు కనిపించాయి : రాఖీ భాయ్
రాకేష్ మాస్టర్ చనిపోయారని తెలియగానే తాను గాంధీ ఆసుపత్రికి వెళ్లానని చెప్పాడు రాఖా భాయ్. నిన్నటి వరకూ మాతో మాట్లాడిన మనిషి సడెన్ గా ఇలా అయిపోవడం బాధనిపించిందని అన్నాడు. ఆ రోజు రాకేష్ మాస్టర్ పెదవి పై గాయాలు ఉన్నాయని తనకు డౌట్ వచ్చి రాకేష్ మాస్టర్ ను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆయన్ను అడిగానని అన్నారు. ఆదివారం ఉదయం ఆయన రూమ్ లో చలనం లేకుండా పడి ఉన్నాడని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారని చెప్పాడు. అయితే రూమ్ లో రాకేష్ మాస్టర్ వస్తువులు కొన్ని లేవని తర్వాత గుర్తించారని, ఆయన ఫోన్ కూడా కనబడలేదని చెప్పారని చెప్పాడు. అలాగే అక్కడ రెండు ఏపీకి సంబంధించిన బీర్ లు కనిపించాయని చెప్పాడు. దీంతో తమకు అనుమానం వచ్చిందని అన్నాడు. ఎవరైనా వచ్చి మాస్టర్ పై దాడి చేశారా అనే అనుమానం కలిగిందన్నాడు.
Also Read : పూర్ణ మళ్ళీ వచ్చిందోయ్ - అవును, 'ఢీ 16'తో రెడీ!
ఆంధ్రలో మాస్టర్ పై దాడి జరిగింది..
రాకేష్ మాస్టర్ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆయన మీద ఎటాక్ కూడా చేశారని చెప్పాడు రాఖీ భాయ్. వాస్తవానికి ఎవరో హీరో ఫ్యాన్స్ సునిశిత్ మీద దాడి చేయడానికి వచ్చారని, ఆయన నివాసం దగ్గర నానా హంగామా చేశారని, ఆ విషయాన్ని రాకేష్ మాస్టర్ తనకు చెప్పారని చెప్పాడు. బహుశా వ్యక్తిగత కక్ష్యతో ఎవరైనా ఈ పని చేసుంటారా అనే డౌట్ ఉందన్నాడు. ఏపీలో దాడి చేస్తే అనుమానం వస్తుందని, పనికట్టుకొని ఇక్కడకు వచ్చి దాడి చేసుండే అవకాశం కూడా లేకపోలేదని అన్నాడు. రూమ్ లో పరిస్థితి చూస్తే అలా అనిపించిందన్నాడు. డాక్టర్లు కూడా లివర్ పగిలి రక్తం వచ్చిందని చెప్పారని, బహుశా ఆయన మీద దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే గతంలోనే ఆయన కు మేజర్ ఆపరేషన్ అయిందని, ఎవరో బలంగా ఆ ఆపరేషన్ పడిన చోట దాడి చేసి ఉంటారనే అనుమానం కూడా తమకు వస్తుందని చెప్పాడు. ఏదేమైనా రాకేష్ మాస్టర్ మృతిపై లోతైన విచారణ చేసి అసలు నిజాలు బయటపెట్టాలని చెప్పాడు రాఖీ భాయ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : పూజా హెగ్డేను తీసేసి మహేష్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?