Rajinikanth Nag Ashwin For Crazy Project: 'కూలీ' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్. వారి హ్యాపీనెస్ మరింత పెంచేలా ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. మరో స్టార్ డైరెక్టర్‌తో ఆయన మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ డైరెక్టర్‌తో

గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా 'కల్కి 2898 AD' మూవీతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు నాగ్ అశ్విన్. తెలుగు సినిమా స్క్రీన్‌పై ఓ విజువల్ వండర్‌ను ఆవిష్కరించగా... దాదాపు రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనా ప్రభాస్ డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నాగ్ అశ్విన్ మరో క్రేజీ ప్రాజెక్టును లైన్‌లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

తలైవాతో...

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నాగ్ అశ్విన్ ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ తలైవాతో మీటింగ్ ఫిక్స్ చేయగా... ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆయనకు వినిపించారట. ఈ స్టోరీ లైన్‌తో ఇంప్రెస్ అయిన రజినీకాంత్... పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని సూచించారట. దీంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ట్రాక్‌లోకి ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అశ్వినీదత్‌తో రజినీ కాంత్‌కు మంచి అనుబంధం ఉంది. చాలాకాలంగా వారిద్దరూ ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేయాలని అనుకుంటున్నారు.

చివరకు నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీకి తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అర్థమవుతోంది. తెలుగు దర్శకులతో పని చేయాలని రజినీకాంత్ చాలాకాలంగా అనుకుంటున్నారట. గతంలో బింబిసార ఫేం వశిష్ట మల్లిడి, వివేక్ ఆత్రేయ రజినీకాంత్... కథలు వినిపించినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ త్వరలోనే ట్రాక్‌లోకి వస్తుందని తెలుస్తోంది.

Also Read: ఇది నా ఊరు సార్... నేను వదిలిపెట్టను - హై యాక్షన్ థ్రిల్లర్... శివకార్తికేయన్ 'మదరాసి' ట్రైలర్

కల్కి 2898 AD సీక్వెల్ ఎప్పుడు?

'కల్కి 2989 AD' మూవీని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ సీక్వెల్‌పై గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. అయితే, ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. మారుతి 'ది రాజాసాబ్'తో పాటు హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీష్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓవైపు 'కల్కి 2898 AD' పనులు చేస్తూనే నాగ్ అశ్విన్ ఆలియా భట్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగా... ఆలియా సైతం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారట. దీంతో రజినీతో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.