Sivakarthikeyan's Madharaasi Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో లేటెస్ట్ హై యాక్షన్ థ్రిల్లర్ 'మదరాసి' నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ అదుర్స్

ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్‌లో శివకార్తికేయన్ అదరగొట్టారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్స్, బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయి. 'నీలాగే ఇతరులను ప్రేమించు. అందరూ నీ కుటుంబమే అనుకో. అదే అన్నీ రిలీజియన్స్ అందరు దేవుళ్లు చెప్పేది.' అంటూ ఓ సాఫ్ట్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ఆసక్తిని పెంచేసింది. ఫస్ట్ లవ్, ఫీల్, ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ట్రైలర్ ఆ తర్వాత భారీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

ఇల్లీగల్ గన్స్‌ను తమిళనాడులోకి రాకుండా ఎన్ఐఏ బృందం చేపట్టిన యాక్షన్ బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. గన్ మాఫియాను ఓ ఎన్ఐఏ ఆఫీసర్ ఎలా అడ్డుకున్నాడనేదే ఈ మూవీ కథాంశం అని తెలుస్తోంది. శివకార్తికేయన్ లుక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'తను తల్చుకుంటే అది పూర్తి చేయడానికి ఎంత ఎక్స్ట్రీమ్‌కు అయినా వెళ్తాడు.' అంటూ ఓ డాక్టర్ చెప్పడం ప్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్లు అర్థమవుతోంది. అసలు ఆ గన్ మాఫియాను ఈ ఎన్ఐఏ ఆఫీసర్ ఎలా అడ్డుకున్నాడు అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 'ఇది నా ఊరు సార్. నేను వదలను' అనే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది.

 

సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా... వీరితో పాటే విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజు మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవల్‌లో తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.

Also Read: ఇట్స్ అఫీషియల్ - డిఫరెంట్ రోల్... డిఫరెంట్ టైటిల్... ఆసక్తికరంగా విశాల్ కొత్త మూవీ

ఓటీటీ డీల్ ఫిక్స్

ఇక రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' 'మదరాసి' డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్‌ను 'ZEE' నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక థియేట్రికల్ రన్ తర్వాత సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా అమరన్‌తో మంచి విజయం అందుకున్న శివకార్తికేయన్ ఆ జోష్ కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.