Vishal's New Movie Title Teaser Out: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన కొత్త మూవీ టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. రవి అరసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులైలో ప్రారంభం కాగా టైటిల్, స్టోరీపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ బ్రేక్ చేస్తూ టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
డిఫరెంట్ రోల్... డిఫరెంట్ టైటిల్
విశాల్ కెరీర్‌లో ఇది 35వ సినిమా కాగా... ఈ ప్రాజెక్టుకు డిఫరెంట్‌గా 'మకుటం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అంజలి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. పలు సూపర్ హిట్ చిత్రాలు అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా ఆ సంస్థకు ఇది 99వ సినిమా. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: కాంతార చాప్టర్ 1... తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్ - టాలీవుడ్ టాప్ హీరోలకు ఈక్వెల్
అసలేంటీ 'మకుటం'?
ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో విశాల్‌ను చూడబోతున్నట్లు టైటిల్ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'మకుటం' అంటే కిరీటం అని అర్థం. సముద్రం, పోర్ట్ ఏరియాలో ఓ డాన్ పాత్రలో విశాల్ కనిపిస్తారనే చర్చ సాగుతోంది. టీజర్ ప్రారంభంలోనే చేపలు, భారీ సొరచేపతో పాటు ఆక్టోపస్ ఓ భారీ ఓడను చూపించగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. పోర్ట్ ఏరియాలో జనం కేకలు, కేరింతల మధ్య బ్యాక్ డ్రాప్‌లో విశాల్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. మొత్తానికి 'మకుటం' అనే టైటిల్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషిస్తుండగా... విశాల్, అంజలి కాంబోలో ఇది రెండో సినిమా. గతంలో 'మద గజ రాజా' మూవీలో వరలక్ష్మి, అంజలిలతో కలిసి విశాల్ నటించగా... మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ హిట్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.