Rajinikanth stands up for fans request inside the plane: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింప్లిసిటీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. స్టార్ హీరో అయినప్పటికీ అభిమానులతో సరదాగా కలిసిపోతుంటారు. తాజాగా... ఆయన కామన్ మ్యాన్‌లా విమానంలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. గతంలోనూ ఆయన సింప్లిసిటీకి సంబంధించిన వీడియోస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
తలైవా మీ ఫేస్ చూడాలనుంది...
తాజాగా... రజినీకాంత్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించగా ఆయన్ను చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెనుక నుంచి ఓ ఫ్యాన్... 'తలైవా మీ ఫేస్ చూడాలని ఉంది.' అంటూ రిక్వెస్ట్ చేయగా... రజినీ లేచి నిలబడి అందరికీ అభివాదం చేశారు. దీంతో అందరూ హుషారుగా కేకలు వేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఆయన సింప్లిసిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రజినీ తలుచుకుంటే ఓ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లొచ్చని... కానీ బిజినెస్ క్లాస్‌లో కూడా కాకుండా ఎకానమీ క్లాస్‌లోనే సామాన్యుడిలా జర్నీ చేయడం ఆయనకే సాధ్యమైందంటూ కొనియాడుతున్నారు.
Also Read: 'వార్ 2' నుంచి ఎన్టీఆర్, హృతిక్ ఎనర్జిటిక్ సాంగ్ టీజర్ - ఆ స్టెప్పులకే దునియా సలాం అనాలంతే...
ఆగస్ట్ 14న 'కూలీ'
రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అవెయిటెడ్ మూవీ 'కూలీ' ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఓ పోర్టులో జరిగే గోల్డ్ స్మగ్లింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'దేవా' రోల్ తలైవా నటించగా... నెగిటివ్ రోల్ 'సైమన్'గా కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, సత్యరాజ్, మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, మహాంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు.