Pawan Kalyan Ustaad Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ షూటింగ్ పార్ట్ మ్యాగ్జిమమ్ పూర్తి కాగా మిగిలిన భాగాన్ని కూడా టీం శరవేగంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె వల్ల షూటింగ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ లేదంటూ అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని.
జస్ట్ 25 డేస్ అంతే...
సినీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ ఉస్తాద్ షూటింగ్‌పై లేదని... ఇంకో 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు నవీన్ తెలిపారు. రిలీజ్ డేట్ గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పారు. 'సు ఫ్రమ్ సో' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆయన... టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న తాజా పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని... కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరుగుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని... నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా తగ్గిందని అన్నారు.
Also Read: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా... ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తా: ఇండస్ట్రీ ఇష్యూపై బాలకృష్ణ
పవన్ షెడ్యూల్ కంప్లీట్
ఈ మూవీలో పవన్ షెడ్యూల్ పూర్తైనట్లు 2 రోజుల క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చారు. మూవీలో ఆయన పార్ట్ షూటింగ్ పూర్తి చేసినట్లు చెబుతూనే పవన్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'పవన్ సపోర్ట్ వల్లే షూటింగ్ ఇంత వేగంగా పూర్తైంది. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం... మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే' అంటూ ప్రశంసలు కురిపించారు.
క్లైమాక్స్ వేరే లెవల్
ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్ వేరే లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఎమోషనల్ అండ్ హై వోల్టేజ్‌తో కూడిన క్లైమాక్స్‌ను డిజైన్ చేశారట. నబకాంత మాస్టర్ ఫైనల్ పార్ట్‌కు కొరియోగ్రఫీ అందించగా... ఈ సీక్వెన్స్ ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన వీరిని పవన్ ప్రత్యేకంగా అభినందించారట. 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌గా తన పవర్ చూపించారు పవన్. ఇప్పుడు కూడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించనున్నారు.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే పార్థిబన్, కేఎస్ రవికుమార్, నవాబ్ షా, రాంకీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, టెంపర్ వంశీ, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ లుక్స్, యాక్షన్ అదిరిపోగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీని త్వరగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేయాలని కోరుతున్నారు.