Rajnikanth's Gym Workout Rare Video: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వయసులోనూ ఆయన స్టైల్, గ్రేస్ వేరే లెవల్. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన యాక్షన్ సీక్వెన్స్‌ చూస్తుంటే తలైవా ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇంత వయసులోనూ ఆయన అంత ఫిట్‌గా, ఫుల్ జోష్‌తో యువకుడిలా వర్క్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

జిమ్‌లో వర్కౌట్స్

74 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండే నటుల్లో రజినీ కాంత్ ఒకరు. ఇటీవల ఓ రిసార్ట్‌లో అవుట్ డోర్ జిమ్‌లో ఆయన వర్కౌట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేస్తూ తన ఫిట్ నెస్ ప్రదర్శించారు. రెడ్ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి తన కోచ్ సజిషన్స్ పాటిస్తూ వర్కౌట్స్ చేశారు.

దీన్ని చూసిన నెటిజన్లు రజినీ సార్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన అంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఇదేనంటూ పేర్కొంటున్నారు. తలైవాను చూసి చాలా మంది యూత్ కూడా నేర్చుకోవాలంటూ అభిప్రాయపడుతున్నారు.

Also Read: బిపాసాకు మృణాల్ సారీ... అప్పుడు నాకు 19 ఏళ్లు, తెలిసీ తెలియక ఏదో మాట్లాడా, క్షమించమ్మా!

జిమ్, వ్యాయమం, మార్నింగ్ వాక్‌పై రజినీకాంత్‌ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ పలు సందర్భాల్లో తన అభిమానులకు చెబుతుంటారు. ఆయనకు డైలీ మార్నింగ్ వాక్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇటీవల చెన్నైలోని పోయెస్ గార్డెన్‌ వీధుల్లో ఓ కామన్ మ్యాన్‌లా మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. 74 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తుంటారు. 

చెన్నైలో ఇటీవల జరిగిన 'కూలీ' మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హెల్త్, ఫిట్‌నెస్, వ్యాయామంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రశాంతమైన జీవితం కావాలంటే ప్రతి ఒక్కరూ డైలీ వ్యాయామం చేయాలని చెప్పారు. డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల కలిగే నష్టాలు... తన లైఫ్‌పై  గతంలో అవి ఎలాంటి ప్రభావం చూపాయో కూడా గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే తాను వాటిని మానేసినట్లు చెప్పారు.

కూలీ కలెక్షన్స్

సినిమాల విషయానికొస్తే... తలైవా హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కూలీ' మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే ప్రీమియర్స్‌తో కలిపి రూ.75 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియావ్యాప్తంగా రూ.65 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఫస్ట్ డే రూ.140 కోట్ల మార్క్ దాటింది. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.