సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడుగా నటించిన తాజా సినిమా 'కూలీ' (Coolie). థియేటర్లలోకి రావడానికి పట్టుమని 15 రోజుల సమయం కూడా లేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల కానున్న సంగతి తెలిసిందే మరి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అంటే....

ఆగస్టు 2న కూలీ ట్రైలర్!Coolie Trailer Release Date: ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం దర్శకుడు లోకేష్ కనకరాజ్ వెల్లడించారు. సినిమాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ కూడా ఆ విషయాన్ని ట్వీట్ చేసింది. ఇప్పుడు మరోసారి ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. 

ఆగస్టు 2న 'కూలీ' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దాంతో పాటు సినిమాలో ప్రధాన తారాగణం అందరి ఫోటోలు అందులో ఉంచింది. ఈ స్టిల్ అందరి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Also Read: ఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌ల‌యాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తెలుగులో విడుదల... ఎవరంటే?Coolie Telugu Release: 'కూలీ' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ హక్కులను అగ్ర నిర్మాతలు డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రై.లి. సొంతం చేసుకుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.

Also Read: బిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!

Coolie Full Cast: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ'లో నాగార్జున విలన్ రోల్ చేశారు. ఇంకా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సత్యరాజ్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర, కమల్ కుమార్తె - స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ నిర్మించిన చిత్రమిది. దీనికి అనిరుద్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్.