Rajinikanth's Coolie First Single Released: సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'కూలీ'. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
సాంగ్ అదుర్స్
'చికితు' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా.. రజినీకాంత్ ఫుల్ గ్రేస్, స్టైల్ అదిరిపోయింది. ప్రముఖ యాక్టర్, డైరెక్టర్ టి.రాజేందర్, అనిరుధ్ కలిసి ఈ పాట పాడారు. రజినీ కాంత్ గ్రేస్, స్టైల్ అదిరిపోయింది. 'బ్రో.. వాట్ దా. చాలు బ్రో ఓ హాట్ కప్ టీ తర్వాత మళ్లీ వద్దాం.' అంటూ సాంగ్ ప్రారంభం కాగా.. రాజేందర్, అనిరుథ్ డైలాగ్స్‌తో పాటు డ్యాన్స్ అదిరిపోయింది.
ఈ మూవీలో తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓ కీలక రోల్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందగా.. కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు.
Also Read: పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు
సూపర్ స్టార్ గ్రేస్, ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్, ఖైదీ, మాస్టర్, లియో వంటి మూవీస్ కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకోగా.. 'కూలీ'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని కింగ్ నాగార్జున భావిస్తున్నారట. ఇందులో ఆయన నెగిటివ్ రోల్‌లో సైమన్‌గా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నాగ్ పట్టుబడితే మాత్రం తెలుగు రైట్స్ ఆయనకే దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
మరోవైపు.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చే మూవీస్ ఏవైనా తెలుగులో సునీల్ నారంగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయనతో పాటు సురేష్ బాబు దిల్ రాజు కూడా యాడ్ అవుతారు. ఈ క్రమంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ కూడా 'కూలీ' తెలుగు రైట్స్ కోసం కోట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ రైట్స్ ఎవరికి దక్కుతాయే చూడాల్సి ఉంది. రజినీకాంత్ లాస్ట్ మూవీ 'వేట్టయాన్' మంచి టాక్ సొంతం చేసుకున్నా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు హిట్ కాంబోతో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.