Hombale Films Announces 7 Big Projects In Mahavatar Cinematic Universe: కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ హిట్స్ ఆడియన్స్‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. ప్రస్తుతం ఈ మూవీస్‌కు సీక్వెల్‌తో పాటు భారీ ప్రాజెక్టులు తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది.

విష్ణుమూర్తి అవతారాలు.. యానిమేటెడ్ మూవీస్

విష్ణుమూర్తి అవతారాలే అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో మూవీస్‌గా అందించనున్నట్లు 'హోంబలే ఫిల్మ్స్' తెలిపింది. 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా 7 సినిమాలను నిర్మించనున్నట్లు వెల్లడించింది. 2037 వరకూ ఈ ప్రాజెక్టులు రానుండగా.. వాటి టైటిల్స్, రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం అశ్విన్ కుమార్ దర్శకత్వంలో 'మహావతార్: నరసింహ'ను రూపొందిస్తుండగా.. దీంతో పాటే మరో 6 సినిమాలు అందించనుంది. ఈ మొత్తం మూవీస్ రెండేళ్లకు ఒకటి చొప్పున 2037 వరకూ రిలీజ్ కానున్నాయి.

ఆ 7 మూవీస్ ఓసారి చూస్తే..

  • మహావతార్: నరసింహ - 2025 జులై 25
  • మహావతార్: పరశురామ్ - 2027
  • మహావతార్: రఘునందన్ - 2029
  • మహావతార్: ద్వారకాదీశ్ - 2031
  • మహావతార్: గోకులానంద్ - 2033
  • మహావతార్: కల్కి 1 - 2035 
  • మహావతార్: కల్కి 2 - 2037

దీనికి సంబంధించి స్పెషల్ వీడియోను తమ 'X' అకౌంట్‌లో షేర్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. 'అవకాశాలు అంతులేనివి. మన పురాణ కథలు స్క్రీన్‌పై గర్జించడం చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. భారీ సినిమాటిక్ జర్నీకి రెడీగా ఉండండి.' అంటూ రాసుకొచ్చింది. విష్ణుమూర్తి 10 అవతారాలపై మూవీస్ తెరకెక్కిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో ఫస్ట్ మూవీ 'మహావతార్: నరసింహ'ను 3Dలో ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆడియన్స్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు.. టీం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది.

Also Read: ఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?

'హోంబలే ఫిల్మ్స్' రూపొందించిన 'కాంతార', 'కేజీఎఫ్', 'సలార్' మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచాయి. వీటికి సీక్వెల్స్ కూడా రెడీ అవుతున్నాయి. రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించిన 'కాంతార' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే జోష్‌తో ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1' మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన ఘటనల ఆధారంగా ప్రీక్వెల్ రూపొందుతోంది. 'పుంజుర్లి' దేవునికి సంబంధించి ఎక్కువ సీన్స్ ఈ పార్ట్‌లోనే ఉండబోతున్నాయి. ఇక మహావతార్: నరసింహ, ప్రభాస్ 'సలార్: శౌర్యంగ పర్వం' మూవీ కూడా రానుంది.