Rajendra Prasad's About Abuse Words On Ali: ఇకపై తన జీవితంలో అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని సీనియర్ యాక్టర్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో అలీపై బూతు కామెంట్స్ పెను దుమారం రేపిన వేళ ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. 

Continues below advertisement


ఎవరినీ అమర్యాదగా మాట్లాడను


ఈ క్షణం నుంచి ఇకపై ఎవరినీ అమర్యాదగా మాట్లాడనని చెప్పారు రాజేంద్రప్రసాద్. ఆ కామెంట్స్‌పై అలీకి ఎలాంటి ఇబ్బంది లేదని.. అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నారని అన్నారు. 'అలీ నేను పర్సనల్‌గా మాట్లాడుకున్న విషయం ఇది. ఆయనకు ఇబ్బంది లేదు. మీరెందుకు పెద్దది చేస్తున్నారు. ఇండస్ట్రీలో హానెస్ట్‌గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది.' అని అన్నారు.


చాలా హర్ట్ అయ్యాను


మొన్న ఈవెంట్‌లో జరిగిన పరిణామాలకు చాలా హర్ట్ అయినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. 'జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నా. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తా. అలా పిలవడం మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నా. నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతా. నా పని నాకు ఉంది. ఎవరో ఏదో పని లేని వాళ్లు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను.


ఇండస్ట్రీలో ఉన్న వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. ప్రేమలు ఎక్కువైతే వచ్చిన సమస్యే ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పటిలా ఎమోషన్స్, ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు లేవు. అందుకే ఎవరి లిమిటేషన్స్‌లో వారు ఉండడం బెటర్ అని తెలుసుకున్నా. జీవితంలో ఏదీ టేకిట్ గ్రాంటెడ్‌గా ఉండకూడదు. డేవిడ్ వార్నర్ విషయంలో ఆ కామెంట్స్ చేసినప్పుడు కూడా ఆయన సహా నితిన్, శ్రీలీల అంతా కలిసి బయటకు వచ్చాం. ఆ చనువు కొద్దీ మాత్రమే అలాంటి పిలుపు వచ్చేసింది.' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.


Also Read: లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ - ఒళ్లంతా గోల్డ్.. లారెన్స్ 'బెంజ్' మూవీ సాలిడ్ అప్‌డేట్..


అసలేం జరిగిందంటే?


ఈ నెల 1న సీనియర్ డైరెక్టర్, యాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయనతో పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా హాజరయ్యారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ ఈవెంట్‌కు హాజరు కాగా.. స్టేజీపై ఆయన అలీని ఉద్దేశించి కొన్ని బూతు వర్డ్స్ వాడడం ఇబ్బంది కలిగించింది. 'ఏరా అలీగా ఎక్కడ? ఇటు రా లం...' అంటూ నోరు జారారు. అయితే.. అలీ కూడా దీన్ని సరదాగానే తీసుకున్నారు.


ఎంత చనువు ఉన్నా తోటి యాక్టర్‌ను అలా అనడం ఏంటంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలోనూ నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను సంబోధించిన తీరుపైనా అంతా చర్చించుకున్నారు. అయితే.. దీనిపై స్పందించిన అలీ.. రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని.. కుమార్తె పోయిన దుఃఖంలో ఉన్నారని.. ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు. తాజాగా.. ఈ అంశంపైనే రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.