Lokesh Kanagaraj's Benz Movie Update: సినిమాటిక్ యూనివర్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఆయన ఇప్పటివరకూ 3 మూవీస్ తీసి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి మూవీస్ తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 

లోకేశ్ డైరెక్టర్‌గానే కాకుండా పలు సినిమాలకు కథలు అందిస్తూనే.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా లోకేశ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న మూవీ 'బెంజ్'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.

విలన్‌గా మలయాళ స్టార్

లారెన్స్ హీరోగా నటిస్తోన్న 'బెంజ్' మూవీలో మలయాళ స్టార్ నివిన్ పౌలీ విలన్ రోల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది. ఒళ్లంతా గోల్డ్, వాచ్, చివరకు పళ్లు కూడా బంగారంతోనే ఉన్న నివిన్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. వీడియో చివర్లో తన పేరు 'వాల్టర్' అని చెప్పడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

ఈ మూవీ నివిన్ రోల్ చూసిన నెటిజన్లు అది విక్రమ్ 'రోలెక్స్' పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ క్లైమాక్స్‌లో 'సూర్య'ను రోలెక్స్‌గా పరిచయం చేస్తూ హైప్ క్రియేట్ చేశారు లోకేశ్. 'బెంజ్' మూవీ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనని క్లారిటీ ఇవ్వగా.. ఈ రోల్ ఎందులో లింక్ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో నివిన్ విలన్‌గా డ్యూయల్ రోల్ చేస్తారని వీడియోను బట్టి తెలుస్తోంది.

Also Read: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ - రిలీజ్‌కు ముందే ఎన్ని రూ.కోట్ల వసూళ్లంటే?

మలయాళ హీరో.. ఇప్పుడు విలన్‌గా..

నివిన్ పౌలీ మలయాళంలో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన 'ప్రేమమ్' మూవీలో హీరోగా నటించి మెప్పించారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ 'బెంజ్' మూవీలో విలన్ రోల్ చేస్తున్నారు. వయలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుండగా.. నివిన్ విలన్ రోల్ ఎలా ఉండబోతోందనే దానిపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో ట్రెండ్ అవుతోంది.

ఇక 'బెంజ్' సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరో కాగా.. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లారెన్స్ సరసన కోలీవుడ్ భామ ప్రియా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.