రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్ (Prabhas Remuneration Per Movie) ఎంత? ఇండస్ట్రీ ప్రముఖులను మాత్రమే కాదు... సామాన్య ప్రేక్షకులు అడిగినా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తారు. ఒక్కో సినిమాకు ఆయన 150 కోట్ల రూపాయలను పారితోషికం కింద తీసుకుంటున్నారని ఫిలిం ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ తగ్గిందట. 

రాజా సాబ్... 100 కోట్లు మాత్రమే!Prabhas Remuneration For The Raja Saab: ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలలో 'ది రాజా సాబ్' ఒకటి. ఈ సినిమాకు గాను ప్రభాస్ 100 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారట. 'ఆదిపురుష్' ఫ్లాప్ కావడంతో 50 కోట్ల రూపాయలను తగ్గించి ఇవ్వమని నిర్మాతకు చెప్పారట. 

'ది రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఆదిపురుష్' సినిమాను తెలుగులో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమాకు పెట్టిన డబ్బుల్లో చాలా వరకు రాలేదు. భారీగా నష్టపోయారు. అందుకని 'ది రాజా సాబ్' రెమ్యూనరేషన్‌లో డిస్కౌంట్ ఇచ్చారట. 

డిసెంబర్ 5న థియేటర్లలోకి...మారుతి దర్శకత్వం వహిస్తున్న ‌'ది రాజా సాబ్' చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు వచ్చింది. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. అంత కంటే ముందు ఈ నెల 12వ తేదీన టీజర్ విడుదల కానుంది.

Also Readవీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు... అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్న పవర్ స్టార్

'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లగా నటిస్తున్నారు. తన కెరీర్‌లో ఫస్ట్ టైం ప్రభాస్ ఒక హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రభాస్ లుక్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిని అట్రాక్ట్ చేశాయి. ఆయన హ్యాండ్సమ్‌గా ఉన్నారని అందరూ అంటున్నారు. 

Also Readసెన్సార్, వీఎఫ్ఎక్స్ సమస్యల నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... హరిహర వీరమల్లు వాయిదాపై ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్

'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు సగటు ప్రేక్షకులను మాత్రమే కాదు... అభిమానులను కూడా అంతగా మెప్పించలేదు. అయితే 'సలార్'తో మళ్లీ ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. ఆ సినిమా ఆయన స్టార్‌డమ్ ఎటువంటిదో చెప్పింది. బాక్స్ ఆఫీస్ బరిలో 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా... కల్కి 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అందువల్ల 'ది రాజా సాబ్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.