Bunny Vas Works Production House First Movie Pre Look Released: టాలీవుడ్ టాప్ ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో బన్నీ వాస్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో మంచి హిట్స్ అందించిన ఆయన 'బన్నీ వాస్ వర్క్స్' పేరుతో ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశారు. ఈ బ్యానర్ నుంచి కొత్త మూవీ కూడా త్వరలో రాబోతోంది.

ఆసక్తికరంగా ప్రీ లుక్

ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన ప్రీ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ నవ్వులు పూయించడం సహా ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్‌తో రోలర్‌ కోస్టర్‌ను సూచిస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ వాస్ వర్క్స్‌తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఎవరో చెప్పుకోండి?

ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. నిర్మాత బన్నీ వాస్ చేసిన పోస్ట్ హైప్ క్రియేట్ చేసింది. 'ముందుచూపు కాదు. కానీ ఓ రహస్య దృశ్యం. మీరు ఊహించే ముఖాలు, కానీ అవి మీకు తెచ్చే పిచ్చిని ఊహించలేవు. ఎవరో చెప్పుకోండి చూద్దాం.' అంటూ రాసుకొచ్చారు.

ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు. బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ తొలిసారిగా సినిమాను సమర్పిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్‌తో కలిసి తండేల్ మూవీకి పని చేసి, బ్లాక్ బస్టర్ అందించారు. అలాగే.. 'ఆయ్', 'సింగిల్' వంటి సినిమాలతో తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్‌పై కూడా హైప్ పెంచేస్తున్నారు. 'హాయ్ నాన్న' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టుకి చేతులు కలపడం మరింత బజ్ క్రియేట్ చేస్తోంది.

Also Read: హార్డ్ డిస్క్‌ ఎత్తుకెళ్లిన వారు మనోజ్‌తో ఉంటారట - పాస్ వర్డ్ ఉంది సేఫే కానీ.. మంచు విష్ణు ఏం చెప్పారంటే?

ఈ చిత్రంతో ఎస్.విజయేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తుండగా.. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్.ఆర్.ధృవన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సిద్ధార్థ్ ఎస్.జె సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. పీకే ఎడిటర్ కాగా.. గాందీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.