దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) అభిమానులకు, ఆయనను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఒక్క విషయం బాగా తెలుసు. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని వెండితెరకు తీసుకు రావడం అని! అయితే... తన కలల ప్రాజెక్టు కంటే ముందు మరో పురాణ ఇతిహాస గ్రంథం రామాయణం మీద ఫోకస్ చేశారని వినికిడి.

రామాయణానికి, మహేష్ సినిమాకూ ముడి!ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి ఒక సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణానికి, ఈ చిత్రానికి ముడి పెట్టారట. SSMB29లో‌ కథంతా సంజీవని చుట్టూ తిరుగుతుందని సమాచారం అందుతోంది. సంజీవని కోసం హీరో మహేష్ అన్వేషణ సాగిస్తాడని, దాని కోసం ప్రపంచమంతా అడ్వెంచర్ చేస్తాడని, ఆ ప్రయాణం అంతా ప్రేక్షకులకు థ్రిల్లింత పంచుతుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మహేష్ సినిమాలో సంజీవని తీసుకురావడం ద్వారా మహాభారతం కంటే రామాయణాన్ని రాజమౌళి ముందుగా టచ్ చేస్తున్నారు. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యానిస్తున్నాయి.

Also Read'పడక్కలం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

'బాహుబలి' లాంటి విజువల్ వండర్ క్రియేట్ చేయడానికి ముందు తనను తాను టెస్ట్ చేసుకున్నారు రాజమౌళి. 'బాహుబలి'కి పునాది రామ్ చరణ్ హీరోగా తీసిన 'మగధీర'తో పడింది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ మీద అవగాహన కోసం 'ఈగ'తో ఒక ప్రయోగం చేశారు. సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు సినిమాలో సంజీవని ప్రస్తావన ద్వారా పురాణాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా, ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకు సైతం నచ్చేలా చెప్పడంలో రాజమౌళి ఒక ట్రయల్ వేస్తున్నారేమో!? జక్కన్న మదిలో ఎటువంటి ఆలోచన ఉందో!?

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మాధవన్ ను అప్రోచ్ అయ్యారట. 

Also Readబ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ