Sri Simha Koduri new film titled as USTAAD: 'ఉస్తాద్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు శ్రీ సింహా కోడూరి. ఈ రోజు సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ఫణిదీప్ రైటర్, డైరెక్టర్. సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌లో వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. 






ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణికి రెండో కుమారుడే శ్రీ సింహా కోడూరి.  ఆయనకు రాజమౌళి బాబాయ్. 'మత్తు వదలరా'తో సింహా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం' సినిమా చేశారు. ప్రస్తుతం 'భాగ్ సాలే', 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాలు చేస్తున్నారు. ఈ రోజు మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.


Also Read: మాస్ మహారాజ రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్, 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ విడుదల వాయిదా


'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత 'ఉస్తాద్' పదం బాగా పాపులర్ అయ్యింది. యంగ్ హీరో రామ్ పోతినేనిని ఉస్తాద్ అంటున్నారు. ఇప్పుడు ఆ టైటిల్‌తో సింహా కోడూరి సినిమా చేస్తుండటం గమనార్హం. 


Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?