సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.‌ సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందించడం మాత్రమే తన వృత్తి అనుకోరు. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మార్పు కోసం ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతీయ సినిమా పరిశ్రమలో రాజమౌళికి ముందు తర్వాత అని ఏ విధంగా అయితే ఇప్పుడు చెబుతున్నారో... అలాగే రాజమౌళి వెళ్ళక ముందు, వెళ్లి వచ్చిన తరువాత అని ఒరిస్సాలోనే కోరాపుట్ గురించి చెప్పాలి.

Continues below advertisement

రాజమౌళి చేసిన ఒక్క పోస్టు వల్ల...సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం చిత్రీకరణకు ఒరిస్సాలోని కోరాపుట్ వెళ్లారు. ఆ జిల్లాలోని సహజ సిద్ధమైన చంద్రగిరి పర్వతాలపై ట్రెక్కింగ్ కూడా చేశారు. అయితే ఆ పర్వతాల మీద ఎత్తైన ప్రాంతం దేవమాలి చెత్తాచెదారం రాజమౌళి కంట పడింది. 

ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ అవసరమని, పర్వతాల మీదకు వెళ్ళిన ప్రజలు తమ చెత్తను వెనక్కి తీసుకురావడం మంచిదని, అప్పుడే ఇటువంటి ప్రాంతాలను మనం కాపాడుకోగలమని ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు.

Continues below advertisement

Also Read'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్విట్టర్ రివ్యూ: హిలేరియస్ ఫస్టాఫ్... మరి సెకండాఫ్? హీరోగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో హిట్ కొట్టాడా? సినిమా టాకేంటి?

సోషల్ మీడియాలో రాజమౌళి చేసిన పోస్ట్ ఒరిస్సాలోని పలువురు దృష్టికి వెళ్ళింది. చంద్రగిరి పర్వతాలపై కొందరు క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. అక్కడ చెత్త అంతా తీసి సంచుల్లో వేసి శుభ్రం చేశారు. ఆ ఫోటోలను సుపర్ణో అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా రాజమౌళి థాంక్స్ చెప్పారు.

భవిష్యత్ తరాలకు సహజసిద్ధమైన వనరులను, ప్రకృతి సంపదను అందించేందుకు అందరం కృషి చేయాలని రాజమౌళి తెలిపారు. ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉండటానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, మనం వేసే ప్రతి అడుగు బాధ్యతాయుతమైన పర్యాటకం వైపు తొలి అడుగు కావాలని దర్శక ధీరుడు ఆకాంక్షించారు. మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో SSMB29 చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?