Good Bad Ugly Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?

Good Bad Ugly Review In Telugu: అజిత్, త్రిష జంటగా 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. 

Continues below advertisement

అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా నటించిన తాజా సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly Movie). ఆయన నటించిన రీసెంట్ యాక్షన్ ఫిలిమ్స్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ తరుణంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్‌తో వింటేజ్ అజిత్ కుమార్‌ను గుర్తు చేశారు. మరి, సినిమా ఎలా ఉంది? సినిమాలో అజిత్, త్రిష కాంబో ఎలా ఉంది? అనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

Continues below advertisement

కథ: ఏకే (అజిత్ కుమార్) గ్యాంగ్‌స్టర్. అయితే 17 ఏళ్లుగా జైలులో ఉంటాడు. కొడుకు విహాన్ (కార్తికేయ దేవ్)కు ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేస్తుంటుంది భార్య రమ్య (త్రిష). తన 18వ పుట్టినరోజును తండ్రితో సెలబ్రేట్ చేసుకోవాలని విహాన్ కోరుకుంటాడు. ఒకవేళ తండ్రి గనుక రాకపోతే ఇంకెప్పుడూ మాట్లాడనని తండ్రితో చెబుతాడు. కొడుకు కోసం జైలర్‌ను రిక్వెస్ట్ చేసి మరీ ఏకే బయటకు వస్తాడు.

ముంబై నుంచి స్పెయిన్ బయలు దేరిన ఏకే ఫ్యామిలీ దగ్గరకు కొందరు గ్యాంగ్‌స్టర్స్‌ వస్తారు. కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలంటే పాత గొడవలు సెటిల్ చేసుకుని రమ్మని భార్య చెబుతుంది. ఇక్కడ గ్యాంగ్‌స్టర్స్‌తో ఏకే మీటింగ్ అయిన టైంలో స్పెయిన్ నుంచి ఫోన్ వస్తుంది. విహాన్ మిస్సింగ్ అని. తర్వాత అబ్బాయి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలుస్తుంది. ఏకే కొడుకును టార్గెట్ చేసింది ఎవరు? అబ్బాయి కోసం ఏకే ఏం చేశాడు? జానీ (అర్జున్ దాస్), జామీ (అర్జున్ దాస్) ఎవరు? ఏకేను రెడ్ డ్రాగన్ అని ఎందుకు అంటారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ: అభిమానుల కోసమా? ప్రేక్షకుల కోసమా? 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఎవరి కోసం? అంటే... మరో సందేహం లేకుండా కేవలం అజిత్ కుమార్ ఫ్యాన్స్ కోసం అని చెప్పవచ్చు. ఎందుకీ మాట అంటే... స్టార్టింగ్ టు ఎండింగ్ అజిత్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం కోసం తీసిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.

తమిళనాడులో అజిత్ కుమార్ అభిమానుల గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో చాలా ఉన్నాయి. తమిళనాడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇందులో అజిత్ తమిళ్ సూపర్ హిట్ సినిమాల రిఫరెన్సులు ఉన్నాయి. ఒకటి రెండు కాదు... దీనా నుంచి బిల్లా బోలెడు సినిమాలను గుర్తు చేశారు. తమిళ్ హిట్ సాంగ్స్ కూడా చాలా వాడారు. అందుకని, సినిమా ఎంజాయ్ చేయాలంటే తమిళ్ ఫిలిమ్స్ మీద ఐడియా ఉండాలి. హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్ మీద కూడా అవగాహన ఉండాలి. డాంగ్ లీ, జాన్ విక్, ప్రొఫెసర్‌ను కూడా వాడేశారు. వాళ్ల గురించి తెలిసినోళ్లకు ఆ సీన్స్ మెప్పిస్తాయి. లేదంటే అసలు అర్థం కావు. తెలుగు డబ్బింగ్ కంటే తమిళ్‌లో సినిమా చూస్తే ఇంకా ఎంజాయ్ చేయవచ్చు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కథ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. కమర్షియల్ సినిమాల్లో ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే హీరోయిజం ఉంది. ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్... హీరోను ఎలివేట్ చేసే అంశాలు తప్ప సినిమాలో కథ లేదు. తెలుగు ప్రేక్షకులను కదిలించేంతలా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ లేదు. వైఫ్ అండ్ హజ్బెండ్ యాంగిల్ కూడా సోసోగా ఉంది. అందువల్ల, కథతో కనెక్ట్ కావడం కష్టం. అజిత్ ముందు విలన్ అర్జున్ దాస్ కూడా తేలిపోయాడు. కేవలం అజిత్ కోసం వెళ్లే ప్రేక్షకులను తప్ప మిగతా జనాలను సినిమా ఆకట్టుకోవడం కష్టం.

కథ, కథనం, దర్శకత్వం వంటి విషయాలను అధిక్ రవిచంద్రన్ పక్కన పెట్టేశారు. ఓ అజిత్ వీరాభిమాని స్క్రీన్ మీద ఏకేను ఎలా చూడాలని కోరుకుంటారో, ఆ తరహా సీన్లు తీశారు. లాజిక్స్ పక్కన పెట్టేసి మేజిక్ మీద కాన్సంట్రేట్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. రెట్రో ఫీల్ ఇచ్చింది. సాంగ్స్ ఓకే. పాటల్లో ఓల్డ్ సాంగ్స్ వాడిన తీరు బావుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

Also Read: 'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?

'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో వింటేజ్ అజిత్ కుమార్ కనిపించారు. ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ హీరోయిజం... అభిమానులకు ఐ ఫీస్ట్ అన్నమాట. ఆయన ముందు మిగతా యాక్టర్స్ మీదకు చూపు వెళ్ళదు. అజిత్, త్రిష కాంబో మరోసారి మెప్పిస్తుంది. తన పాత్ర వరకు త్రిష చక్కగా చేశారు. హీరో అనుచరుడిగా సునీల్, ప్రసన్న తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ప్రభు, టినూ ఆనంద్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇందులో అర్జున్ దాస్ డ్యూయల్ రోల్ చేశారు. గెటప్స్ ఒకేలా ఉన్నాయ్. నటుడిగా ఓకే. 

గుడ్ బ్యాడ్ అగ్లీ... ఇందులో గుడ్ గురించి చెప్పుకోవాలంటే? అజిత్ కుమార్, అజిత్ కుమార్, అజిత్ కుమార్. ఆయన హీరోయిజం తప్ప మరొకటి చూపించాలని గానీ, వింటేజ్ అజిత్‌ను గుర్తు చేయడం తప్ప కథ చెప్పాలని గానీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అనుకోలేదు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. అజిత్ కూడా స్వాగ్, స్టైల్, హీరోయిజం బాగా చూపించారు. ఆయన వీరాభిమానులకు సినిమా నచ్చుతుంది. బ్యాడ్ అంటే... అజిత్ తప్ప సినిమాలో కథ లేదు. సగటు సినీ ప్రేమికులను సినిమా ఆకట్టుకోవడం కష్టం.

Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Continues below advertisement