Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi 2025 Movie Review In Telugu:‌ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారారు. బుల్లితెర కార్యక్రమాలతో అభిమానులను సొంతం చేసుకున్న ఆయన... వెండితెరపై హీరోగా మొదటి అడుగుతో విజయం సాధించారు.‌ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అంటూ హీరోగా రెండో సినిమా చేశారు. ఇవాళ థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్ సిటీలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూడండి. 

ఎక్కడా బోర్ కొట్టలేదు...ఫుల్ కామెడీ ఎంటర్టైనర్!'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదని‌ అతడు తెలిపాడు. సినిమా చూడండి హ్యాపీగా నవ్వుకోండి అని చెప్పుకొచ్చాడు.

ప్రదీప్, దీపిక కెమిస్ట్రీ సూపర్!హీరో హీరోయిన్లు ప్రదీప్ మాచిరాజు, దీపికా‌ పిల్లి బాగా చేశారని పేరు వచ్చింది. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రజెంట్ బాగుండడంతో పాటు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ ఉందని అంటున్నారు.

Also Read: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?

హిలేరియస్ ఫస్ట్ హాఫ్...'గెటప్' శ్రీను, సత్య కామెడీ కేక!'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా హిలేరియస్ గా ఉందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'గెటప్' శ్రీను, సత్య చేసిన కామెడీ సూపర్ ఫన్ జనరేట్ చేసిందట. ఇంటర్వెల్ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ గనుక ఉంటే సినిమా బాగా వచ్చేదని టాక్. ఈ వీకెండ్ టైం పాస్ చేసే సినిమా అని, ఫన్ వాచ్ అని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?