Rajamouli: టాలీవుడ్ దర్శకుల్లో డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఆయన తెరెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచాయి. అంతే కాదు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలిపారు రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. కెరీర్ లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తన అనుకున్న లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు ఆయన. ఉత్తమ దర్శకుడిగా దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన తీసిన కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించే వారు. నటించే అవకాశాలు ఉన్నా దానిపై అంత ఇంట్రస్ట్ లేకపోవడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అయితే తాజాగా రాజమౌళి యాక్టింగ్ కు సంబంధించి స్టైలిష్ లుక్ లో నడుస్తూ ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 


కమర్షియల్ యాక్టింగ్ లోకి రాజమౌళి ఎంట్రీ..


సినిమా ఇండస్డ్రీలో హీరోలతో పాటు సినిమా దర్శకులకు కూడా భారీగానే క్రేజ్ ఉంటుంది. అయినా ఎక్కువ శాతం యాడ్ కంపెనీలు వివిధ భాషల్లో ఉన్న టాప్ హీరోలను సెలెక్ట్ చేసుకొని వాళ్లతో యాడ్ ఫిల్మ్ లు తీసి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటారు. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగానూ కొంతమంది హీరోలు చేస్తారు. హీరోలతో పాటు స్పోర్ట్స్ కు సంబంధించిన ఫేమస్  ఆటగాళ్లతో కూడా యాడ్ ప్రమోషన్స్ వీడియోలు చేస్తారు. అయితే సినిమా డైరెక్టర్లు ఎవరూ ఇలా యాడ్ ఫిల్మ్ లలో చేసిన ధాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు రాజమౌళికి ఆ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. తన కెరీర్ లో మొదటిసారి కమర్షియల్ గా ఓ యాడ్ కోసం యాక్టింగ్ లోకి దిగారట. 


ఫోన్ కంపెనీ యాడ్ కోసం స్టైలిష్ గా..


రాజమౌళి కి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ కోసం తొలిసారి కమర్షియల్ యాక్టింగ్ లోకి దిగారట రాజమౌళి. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోందని అంటున్నారు. అందులో రాజమౌళి మొబైల్ ఫోన్ పట్టుకొని స్టయిల్ గా అటు ఇటు తిప్పుతూ నడుస్తున్నారు. వీడియోలో రాజమౌళి క్రీం కలర్ సూట్ లో స్టైలిష్ లుక్ కనిపిస్తున్నారు. ఓ మొబైల్ కంపెనీ కోసం చేస్తున్న యాడ్ ఫిల్ల్మ్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. ఏదేమైనా రాజమౌళి స్టైలిష్ లుక్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోవచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 


Also Read 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?