రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను పాన్ ఇండియా / వరల్డ్ ప్రేక్షకులు 'బాహుబలి'గా చూశారు. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో భైరవుడిగా, కర్ణుడిగా చూశారు. అయితే... ఈ ఆరడుగుల ఆజానుబాహుడిని ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శకుడు మారుతి!

రాజా సాబ్... రొమాంటిక్ హారర్ కామెడీ!ప్రభాస్ కథానాయకుడిగా మారుతి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫిల్మ్ 'రాజా సాబ్' (The Raja Saab). ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ చిత్రమిది. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. 

Watch Prabhas's The Raja Saab Glimpse Video: 'పాన్ ఇండియా'ను 'ఫ్యాన్ ఇండియా' అని పేర్కొన్నప్పుడే ఈ గ్లింప్స్, సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్రభాస్ లుక్ డిజైన్ చేశారు మారుతి. 'కల్కి 2898 ఏడీ'తో కంపేర్ చేస్తే... కంప్లీట్ కొత్త లుక్, మేకోవర్‌లో చూపించారు.

Also Readబాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌.. ఆహాలో 'అన్‌ స్టాపబుల్ 4 స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?

వచ్చే ఏడాది వేసవికి 'రాజా సాబ్' విడుదల!Raja Saab Release Date: 'రాజా సాబ్' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఏప్రిల్ 10, 2025 రిలీజ్ అని గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

'రాజా సాబ్' గురించి టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ... ''మా సంస్థలో ఇదొక  మెమొరబుల్ మూవీ. ఆల్రెడీ 40 పర్సెంట్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. డార్లింగ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూపించబోతున్నారు దర్శకుడు మారుతి'' అని చెప్పారు.

Also Readహరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?

Raja Saab Movie Cast And Crew: ప్రభాస్ హీరోగా మారుతి రచన, దర్శకత్వంలో పీపుల్  మీడియా ఫ్యాక్టరీ పతాకం టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది రాజా సాబ్'లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని, ఫైట్ మాస్టర్స్: రామ్ లక్ష్మణ్ - కింగ్ సోలొమన్, వీఎఫ్ఎక్స్: ఆర్.సి. కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: తమన్.