Rahul Sipligunj New Song Angrezi Beat: హైదరాబాదీ యువకుడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ ఆస్కార్ వరకూ వెళ్లింది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో కాల భైరవతో కలిసి ఆయన పాడిన 'నాటు నాటు...'కు ఆస్కార్ అవార్డు వచ్చింది. పురస్కారాల ప్రదానోత్సవం రోజున స్టేజిపై సింగర్స్ ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చారు. మరి, ఆస్కార్ తర్వాత పెద్ద సినిమాలకు మాత్రమే అతడు పరిమితం అవుతాడా? చిన్న సినిమాలకు రాహుల్ సిప్లిగంజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? వంటి సందేహాలు ఎవరికైనా వస్తే ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. సాంగ్ నచ్చితే చిన్న పెద్ద తేడాలు లేవని లేటెస్ట్ సాంగ్ ద్వారా హింట్ ఇచ్చాడు. 


అజయ్ ఘోష్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ సాంగ్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ (Ajay Ghosh) హీరోగా తెరకెక్కిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Movie). ఇందులో యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఫ్లై హై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు శివ పాలడుగు రైటర్ అండ్ డైరెక్టర్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమాలో 'అంగ్రేజీ బీట్' సాంగ్ విడుదల చేశారు. దాన్ని రాహుల్ సిప్లిగంజ్ పాడారు.


''ఏ మియా మియా సాలా మియా
ఐసా పార్టీ షురూ కియా
రోడ్డు బ్లాకై మైండ్ షాకై పిచ్చెక్కలా
వాడా మచ్చా సౌండ్ రెడీయా
డీజే మూర్తి వచ్చిండయ్యా
మాస్ బీట్ కొట్టిండంటే ఆడిపోలియా''అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'అంగ్రేజీ బీట్' పాటకు పవన్ సంగీత దర్శకుడు. లిరిక్స్ కూడా ఆయనే రాశారు.


'అంగ్రేజీ బీట్' పాటకు లక్ష వ్యూస్!
స్టార్ హీరోల సినిమాల్లో పాటలు అంటే ప్రేక్షకులకు క్రేజ్ ఉంటుంది. చిన్న హీరోల సినిమాల్లో పాటల వైపు చూడటం తక్కువ. అయితే, మే 16న విడుదల చేసిన అజయ్ ఘోష్ సినిమాలో పాటకు మంచి స్పందన లభించిందని చెప్పుకోవాలి. మూడు రోజుల్లో ఈ సాంగ్ లక్ష వ్యూస్ సొంతం చేసుకుంది.


Also Read: ఓర్నీ... సుమక్కకే పంచ్ వేసిన వింధ్య, గీత - బాయ్‌ఫ్రెండ్‌తో శిల్ప 'అఆ ఉఊ'లు



'మ్యూజిక్ షాప్ మూర్తి'లో అజయ్ ఘోష్ టైటిల్ రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ షాప్ నడిపే ఆయన ఐదు పదుల వయసులో డీజే కావాలని అనుకుంటున్నారు. ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది సినిమా. 'అంగ్రేజీ బీట్' అంటూ హుషారైన బీటులో సాగే ఈ పాటలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ కనిపించారు. ఆయన గెటప్, వేసిన స్టెప్స్ వైరల్ అయ్యేలా ఉన్నాయి. ప్రజెంట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


అజయ్ ఘోష్, చాందిని చౌదరితో పాటు ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రానికి కూర్పు: బొంతల నాగేశ్వరరెడ్డి, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం, సంగీతం: పవన్,సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు - వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి - సత్యనారాయణ పాలడుగు, నిర్మాణ సంస్థ: ఫ్లై హై సినిమాస్, నిర్మాతలు: హర్ష గారపాటి - రంగారావు గారపాటి, రచన - దర్శకత్వం: శివ పాలడుగు.