Dacoit Movie Review In Telugu: హీరో అడివి శేష్, దర్శకుడు సుజీత్, హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్, ప్రముఖ హాస్యనటుడు 'వెన్నెల' కిశోర్ మంచి స్నేహితులు. వాళ్ళంతా ఓ గ్యాంగ్. తన ప్రతి సినిమానూ విడుదలకు ముందు స్నేహితులకు చూపించడం అడివి శేష్ (Adivi Sesh)కు అలవాటు. 'డెకాయిట్'ను కూడా అలాగే చూపించారు. సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటో తెలుసా?
'డెకాయిట్'కు రాహుల్ రవీంద్రన్ రివ్యూ ఏమిటంటే?Dacoit first review in Telugu: తనకు అడివి శేష్ ను చూస్తే గర్వంగా ఉందని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇప్పటి వరకు శేష్ చేసిన సినిమాలు, పెర్ఫార్మన్స్‌లు అన్నిటిలో కంటే 'డెకాయిట్'లో ది బెస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ''ఈ సినిమా చేసే ముందు కొన్ని డౌట్స్ ఉండేవి. అరే... వీడు (శేష్) ఎన్నారై. ఈ క్యారెక్టర్ చేస్తానని అంటున్నాడు ఏంటి? అనుకున్నాం. కానీ పది నిమిషాలు అయ్యేసరికి స్క్రీన్ మీద నా బెస్ట్ ఫ్రెండ్ ని చూస్తున్నా అనేది మర్చిపోయా. క్యారెక్టర్‌తో ట్రావెల్ చేశా. చాలా చాలా కన్విక్షన్ తో చేశాడు'' అని తెలిపారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ''నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నా... ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చింపేసింది. షి ఈజ్ ఫెంటాస్టిక్. కొంత మంది స్క్రీన్ మీద ఏడిస్తే... తెలియకుండా మనం కూడా ఎమోషనల్ అవుతాం. వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతాం. మృణాల్ అంత అద్భుతంగా నటించింది. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ నాకు చాలా బాగా నచ్చారు'' అని చెప్పారు.
Also Read: డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?
మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్!'డెకాయిట్' ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లోయింగ్ అని 'వెన్నెల' కిశోర్ తెలిపారు. అదే విధంగా క్లైమాక్స్ కూడా బావుందని చెప్పారు. అడివి శేష్ కి దణ్ణం పెట్టారు. శేష్ ప్రతి సినిమా తాము విడుదలకు ముందు చూస్తామని... ఇంటర్వెల్ & క్లైమాక్స్ చూసి ఒక 'హై'తో బయటకు వస్తామని రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ తెలిపారు.
అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన 'డెకాయిట్'తో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read: Adivi Sesh: స్నేహితుడి దర్శకత్వంలో అడివి శేష్... 'గూఢచారి' సీక్వెల్ తర్వాత!
