నటుడిగా, కథానాయకుడిగా అడివి శేష్ (Adivi Sesh) రూటే సపరేటు. 'క్షణం' నుంచి 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్', 'హిట్ 2' వరకు... సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. దాంతో ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే, ఇప్పుడు 'డెకాయిట్'తో అది డబుల్ అయ్యింది. శేష్ లాస్ట్ నాలుగు సినిమాలతో కంపేర్ చేస్తే... డబుల్ మార్జిన్‌తో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అసలు, ఈ సినిమా బిజినెస్ ఎంత? శేష్ లాస్ట్ ఫిలిమ్స్ బిజినెస్ ఎంత? అనేది చూస్తే...

'డెకాయిట్' @ 30 కోట్లు!Adivi Sesh Dacoit Pre Release Business: శేష్ ఇమేజ్ వల్ల 'డెకాయిట్'పై మంచి ఇమేజ్ ఏర్పడింది. మృణాల్ ఠాకూర్ ఉండటం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యింది. 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాలతో ఆమెకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందువల్ల... ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Also Read: Raaka: రాకా అంటే ఏమిటి? టైటిల్ మీనింగ్, బాలీవుడ్ & కామిక్ రిఫరెన్స్‌లు తెలుసా?

'డెకాయిట్'కు ముందు?Adivi Sesh Last Five Movies Pre Release Business In Telugu: 'డెకాయిట్'కు 30 కోట్ల బిజినెస్ జరిగితే... దీనికి ముందు శేష్ చేసిన సినిమా బిజినెస్ ఇందులో సగం. అవును... 'డెకాయిట్' ముందు వరకు శేష్ సినిమాల బిజినెస్ 15 కోట్లు దాటలేదు. కానీ, ఇప్పుడు డబుల్ మార్జిన్‌తో నెక్స్ట్ లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు శేష్.

ఒక్కసారి తెలుగు వరకు అడివి శేష్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే?

  • డెకాయిట్: రూ. 30 కోట్లు
  • హిట్ 2: రూ. 14.25 కోట్లు
  • మేజర్: రూ. 13 కోట్లు
  • ఎవరు: రూ. 10 కోట్లు
  • గూఢచారి: రూ. 5 కోట్లు 

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

అడివి శేష్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 72.5 కోట్లు. యంగ్ హీరోలలో ప్రామిసింగ్ బిజినెస్ చేస్తున్న హీరోలలో శేష్ ఒకరు. ఇప్పుడీ సినిమాతో ఆయన నెక్స్ట్ లీగ్ కు వెళ్లడం గ్యారెంటీ. 

'డెకాయిట్' తర్వాత 'గూఢచారి 2'తో అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆల్రెడీ 'గూఢచారి' విజయం సాధించడంతో సీక్వెల్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇమ్రాన్ హష్మీ ఉండటం వల్ల హిందీలో ఇంకా హైప్ పెరుగుతుంది. 'డెకాయిట్'తో 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్ అందుకున్న శేష్, 'జీ 2' (గూఢచారి 2)తో 50 కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతి సినిమాకూ అడివి శేష్ తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నారు. అలాగే, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా! ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?